కన్నడ చిత్రసీమ నుంచి మరో పాన్ ఇండియా మూవీ

కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో శివరాజ్ కుమార్.మాస్ కమర్షియల్, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేయడానికి శివరాజ్ కుమార్ ఎప్పుడు కూడా ముందు ఉంటాడు.60 ఏళ్లు దాటిన కూడా ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు.ఫిట్నెస్ పరంగా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ సిక్స్ ప్యాక్ లో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు.

 Shivaraj Kumar Bajrangi 2 Pan India Movie, Tollywood, Sandalwood, Bollywood, Sou-TeluguStop.com

ఈ మధ్య కాలంలో అతని కెరియర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బజరంగి.కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ హర్ష దర్శకత్వంలో తెరకెక్కింది.

సోషియో ఫాంటసీతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది.ఇప్పుడు మరోసారి హర్ష బజరంగీ సీక్వెల్ తెరకెక్కించాడు.

ఇప్పటికే ఈ సినిమా మెజార్టీ షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే మొదటి సినిమాకి ఈ సినిమాకి కథ విషయంలో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో విస్తృతంగా ఆదరణ లభిస్తుంది.

ఇక యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మధ్యకాలంలో సౌత్ లో భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఆవిష్కరిస్తున్నారు.

బాహుబలి, కేజిఎఫ్ తర్వాత సౌత్ సినిమాలకు హిందీలో కూడా ఆదరణ లభిస్తుంది.ఈ నేపథ్యంలోనే దర్శకనిర్మాతలు ఆలోచన పాన్ ఇండియా వైపు మళ్ళింది.దీంతో సినిమా పెట్టిన బడ్జెట్ తిరిగి రాబట్టుకోవడానికి వీలైనన్ని ఎక్కువ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బజరంగి 2 సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించాలని చూస్తున్నట్లు సమాచారం.

త్వరలో దీనిపై చిత్ర నిర్మాతలు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.మొత్తానికి కే జి ఎఫ్ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో కన్నడ ఇండస్ట్రీ లో కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు మొగ్గుచూపడం, వాటిని పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి సిద్ధపడడం మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube