మళ్లీ ఓటీటీ ద్వారా రాబోతున్న శివాని రాజశేఖర్‌

Shivani Rajashekhar Www Movie Release At Sony Liv Ott

సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటో గ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వం లో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ చిత్రం ‌’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు‘(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు).

 Shivani Rajashekhar Www Movie Release At Sony Liv Ott-TeluguStop.com

ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాలో శివాని క్యూట్‌ లుక్ లో కనిపించబోతుంది.ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాట‌లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి.

 Shivani Rajashekhar Www Movie Release At Sony Liv Ott-మళ్లీ ఓటీటీ ద్వారా రాబోతున్న శివాని రాజశేఖర్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల‌కానుంది.ఇంతకు ముందు శివాని నటించిన అద్బుతం సినిమా కూడా డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ అయ్యి మంచి టాక్ను దక్కించుకున్న విషయం తెల్సిందే.‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` డిజిట‌ల్ రైట్స్‌ని `సోనిలివ్` సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి ద‌క్కించుకుంది.అతి త్వ‌ర‌లో ఈ చిత్రం సోనిలివ్‌లో ప్ర‌సారం కానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డా.రవి ప్రసాద్ రాజు దాట్ల – మా ఫ‌స్ట్ మూవీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా ఆనందంగా ఉంది.ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్‌ మూవీ ఇది.ఓటీటీకి ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌.సోనివంటి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో అసోసియేట్ అవ‌డం చాలా హ్యాపీ.

ఈ సినిమా సోనిలివ్ ద్వారా మ‌రింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం.గుహ‌న్‌గారి మేకింగ్, అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వ‌ర్గాల‌వారిని ఆక‌ట్టుకుంటుంది.` అన్నారు.

 ఈమద్య కాలంలో సౌత్ లో ప్రాచుర్యం పొందేందుకు సోనీ లివ్ ఓటీటీ ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగానే వరుసగా సినిమాలను విడుదల చేస్తోంది.

ముందు ముందు సోనీ లివ్‌ నుండి పెద్ద సినిమాలు కూడా వస్తాయని ఆశిద్దాం.

#OTT #Suresh #Adit Arun #WWW #Sony Liv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube