కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ పట్టేసిన శివాని రాజశేఖర్... ఏకంగా సిఏం కొడుకుతో

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఇద్దరు కూతుళ్ళు ఇప్పటికే హీరోయిన్స్ గా తెరంగేట్రం చేశారు.పెద్ద కూతురు శివాని 2 స్టేట్స్ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

 Shivani Rajasekhar Entry In Kollywood With Udhayanidhi Stalin Movie-TeluguStop.com

దీంతో ఈమె ఎంట్రీ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.కేవీ గుహన్ దర్శకత్వంలో డబ్యూడబ్యూడబ్యూ అనే మూవీలో శివాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

అయితే ఆమె సిస్టర్ రాజశేఖర్ చిన్న కూతురు దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

 Shivani Rajasekhar Entry In Kollywood With Udhayanidhi Stalin Movie-కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ పట్టేసిన శివాని రాజశేఖర్… ఏకంగా సిఏం కొడుకుతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.అలాగే కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు శివానీ రాజశేఖర్ కూడా కోలీవుడ్ ఎంట్రీ ఖరారు చేసుకుంది.

ఆమె తమిళ్ లో ఎంట్రీ ఇస్తుంది కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిది స్టాలిన్ కి జోడీగా కావడం విశేషం.

ఇప్పటికే ఉదయనిది నిర్మాతగా హీరోగా కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా బాద్యతలు చేపట్టాడు.ప్రస్తుతం హిందీమూవీ ఆర్టికల్ 15 రీమేక్ లో అతను హీరోగా నటిస్తున్నాడు.అరుణ్ రాజ్ కామరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ రీమేక్ అవుతుంది.

బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ఇందులో హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ ని తాజాగా ఖరారు చేశారు.

ఇదిలా ఉంటే తెలుగులో డబ్యూడబ్యూడబ్యూతో పాటు తేజ సజ్జా హీరోగా తెరకెక్కనున్న ఫాంటసీ లవ్ స్టొరీలో ఈమె కథానాయికగా నటిస్తుంది.మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరి శివానీ ఎంట్రీ టాలీవుడ్ లో ముందుగా ఉంటుందో, కోలీవుడ్ లో ఉంటుందో త్వరలో తెలిసిపోతుంది.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు