ఏపీ రాజధానిలో అభివృద్ధి జరిగింది! ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం అంటున్న శివాజీ  

ఏపీలో జరుగుతున్న కుట్రల గురించి సంచలన వాస్తవాలు బయట పెట్టిన నటుడు శివాజీ. .

Shivaji Sensational Comments On Trs And Ysrcp-janasena,shivaji Sensational Comments,tdp,trs And Ysrcp

ఎన్నికల ముందు ఏపీపై జరుగుతున్న కుట్రల గురించి నటుడు శివాజీ మళ్ళీ మీడియా ముందుకి వచ్చాడు. ఇక మీడియా సమావేశంలో తెలుగు దేశం పార్టీ ఈ ఐదేళ్ళ కాలంలో అభివృద్ధి జరిగిందని, అలాగే పోలవరం నిర్మాణం కూడా జరుగుతుందని, ఇక 40 వరకు పరిశ్రమలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డాయని, అలాగే రెండు లక్షల వరకు ఉద్యోగాలు కల్పన జరిగిందని శివాజీ చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాలలో తన కేవలం రాజకీయ నాయకులు కేవలం ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటూ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దయ్యబట్టారు. .

ఏపీ రాజధానిలో అభివృద్ధి జరిగింది! ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం అంటున్న శివాజీ-Shivaji Sensational Comments On TRS And YSRCP

ఇక ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ చార్జ్ షీట్ లో 32 కేసులు గురించి తన ఎన్నికల అఫిడివిట్ లో చేర్చారని, ఎలాంటి తప్పు చేయకపోతే ఇన్ని కేసులు కావాలని ఎందుకు ఒక వ్యక్తి మీద పెడతారో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నపళంగా జగన్ కి సపోర్ట్ చేస్తూ టీడీపీని ఓడించే ప్రయత్నం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మీడియాతో చెప్పారు.

అలాగే ఇప్పుడు వైసీపీ తరుపున మీడియా ముందుకి వచ్చి చంద్రబాబుని విమర్శిస్తున్న సినీ నటులకి కేసీఆర్ ఆంధ్రా మీద చేసిన విమర్శలు కనిపించలేదా అంటూ విమర్శించారు. ఇక ఏపీని కేంద్రంగా చేసుకొని చాలా కుట్రలు చేస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చారు.