మరో 'సంచలన విషయం'...బయటపెట్టిన 'శివాజీ'.?  

Shivaji Press Meet About His Shivaji Army-

 • తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఏకైక అంశం ఐటీ దాడులు.ముఖ్యంగా ఐటీ దాడులు ఏపీలో నేతలకి మాత్రం వణుకు పుట్టిస్తున్నాయి.

 • మరో 'సంచలన విషయం'...బయటపెట్టిన 'శివాజీ'.?-Shivaji Press Meet About His Shivaji Army

 • అయితే ఈ దాడులు తరువాత ఏపీలో భారీ స్థాయిలో అల్లర్లు జరగబోతున్నాయా.?? ఏపీలో అశాంతి సృష్టించి రాజకీయ అనిశ్చితికి కారణం కాబోతున్నారా అనే సందేహాలు కలుగక మానవు నటుడు శివాజీ వెల్లడిస్తున్న వార్తలు వింటుంటే.

 • ఏపీలో త్వరలో అల్లర్లు జరగనున్నాయి అంటూ శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.వివరాలలోకి వెళ్తే.

 • Shivaji Press Meet About His Army-

  సినిమారంగం లో సినిమాలు దొరకక.వ్యాపారాలు పెట్టి డబ్బు తగలెయ్యడం ఇష్టం లేక ఖాళీగా ఉండి ఏమి చేయాలో తెలియని ఒక నటుడు ఇప్పుడు తెలుగు తెరపైకి సారీ సారీ ఏపీ రాజకీయ తెరపైకి అటు నటుడిగా కాకుండా ఇటు రాజకీయ నాయకుడిగా కాకుండా అటు ఇటుగా యాక్టింగ్ చేస్తున్నాడు.అదేనండి బ్యాలెన్స్ గా నాటకాలు ఆడుతున్నాడు.

 • బీజేపీ పన్నే ప్రతీ వ్యూహనికి మనోడిని ఎదో ఆహ్వనిస్తున్నట్టుగా తెగ బిల్డప్ ఇచ్చే శివాజీ గారు మళ్ళీ నిన్నటి రోజున మరో బాంబు పేల్చి మళ్ళీ టీడీపీ పరువుని భుజాన పెట్టుకోవడానికి వచ్చేశాడు. అంతేకాదు సంచలన విషయాలు ప్రకటించాడు.

 • సినిమా రంగంలో సినిమాలు లేక కొట్టిమిట్టాడుతున్న బాబు బజానా బృందం లీడర్ అలియాస్ శివాజీ మరో సంచలన విషయంతో మళ్ళీ తెరపైకి వచ్చాడు ఎలాగో వెండి తెరపై వెలగలేక చతికలు పడిన సదరు నటుడికి మీడియా తెరపైన కనిపించే అవకాశం వచ్చే సరికి గతం గుర్తొచ్చి ఒక్కసారిగా పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నాడు. సరే ఇది ఎప్పుడూ ఉండేదే అసలు శివాజీ ఏమన్నాడనే విషయంలోకి వెళ్తే.

 • Shivaji Press Meet About His Army-

  ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఏపీలో కలకలం సృష్టిస్తున్న శివాజీ గతంలో సీఎం చంద్రబాబుకు ఓ రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నోటీసుల అందబోతున్నాయంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు అయితే అన్నట్టుగానే కొద్ది రోజుల వ్యవధిలోనే బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు చేసిన ఆందోళన నేపథ్యంలో ఆయనకు మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే శివాజీ ఇప్పడు మరో బాంబ్ పేల్చాడు…త్వరలో ఏపీలో అల్లర్లకు కుట్రపన్నుతున్నారు బీ అలెర్ట్ అంటూ హెచ్చరికలు చేశాడు. అంతేకాదు ఐటీ దాడులపై టీడీపీ మంత్రులు ,అధికార ప్రతినిధులు ,ఇలా ఎవరికీ వారు మాట్లాడటానికి మొఖం చాటేసుకుని తిరుగుతుంటే ఆ భాద్యతలు కూడా శివాజీ తన నెత్తిన వేసుకున్నాడు.

  ఐటీ దాడుల లక్ష్యం చంద్రబాబు అని అర్థమవుతోందని డైరెక్ట్ గా బాబు ని ఎన్కౌంటర్ చేసేయండి రాష్ట్ర ప్రజలని ఎందుకు హింసించడం.

 • ఎందుకు ఏపీ ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అంటూ మండి పడ్డారు.ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే.

 • ఐటీ దాడులు టీడీపీ మంత్రులు కీలక నేతలపై జరుగితే రాష్ట్ర ప్రజలపై కేంద్రం ప్రతాపం చూపించడం ఇబ్బంది పెట్టడం ఏమిటి అనేది అర్థం కాని విషయం.బహుశా అవకాశాలు లేకపోవడంతో శివాజీకి మతిగాని బ్రమించలేదు కదా బీ అలెర్ట్ అంటున్నారు నెటిజన్లు.