ఆ గాయం వల్ల ఎనిమిదేళ్లు మంచానికే పరిమితమైన శివశంకర్ మాస్టర్.. ఏమైందంటే?

కరోనా రక్కసి వల్ల దేశంలో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారనే సంగతి తెలిసిందే.తాజాగా శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ మృతి చెందారు.1948 సంవత్సరం డిసెంబర్ నెల 7వ తేదీన శివశంకర్ మాస్టర్ జన్మించారు.మాస్టర్ తల్లి పేరు కోమల అమ్మాళ్ కాగా తండ్రి పేరు కల్యాణ సుందర్.

 Shiva Shankar Master Bed Eight Years Full Details Here , Bed, Details Here, Eigh-TeluguStop.com

బాల్యంలోనే శివశంకర్ మాస్టర్ కు ప్రమాదం జరిగింది.సంవత్సరంన్నర వయస్సు ఉన్న సమయంలో మాస్టర్ పెద్దమ్మ ఒడిలో కూర్చున్న సమయంలో ఒక ఆవు తాడు తెంపుకుని రోడ్డుపైకి వచ్చింది.

ఆ ఆవును చూసిన శివశంకర్ పెద్దమ్మ భయపడ్డారు.తమ వైపు ఆ ఆవు వస్తుందని భావించి మాస్టర్ పెద్దమ్మ ఆయనను ఎత్తుకొని లోపలికి పరిగెత్తారు.అయితే వేగంగా పరిగెత్తిన సమయంలో గుమ్మం తగిలి శివశంకర్ మాస్టర్ పెద్దమ్మ, శివశంకర్ మాస్టర్ కిందపడ్డారు.ఆ సమయంలో శివశంకర్ మాస్టర్ వెన్నముకకు తీవ్ర గాయమైంది.

ఆ తర్వాత శివశంకర్ మాస్టర్ నెలరోజుల పాటు జ్వరంతో బాధ పడ్డారు.

డాక్టర్ కు చూపించినా మాస్టర్ ఆరోగ్యం సరికాలేదు.

ఆ సమయంలో శివశంకర్ మాస్టర్ పేరెంట్స్ ఫారెన్ లో డాక్టర్ గా పని చేసి చెన్నైకు వచ్చిన నరసింహ అయ్యర్ అనే వ్యక్తి దగ్గరకు శివశంకర్ మాస్టర్ ను తీసుకెళ్లారు.డాక్టర్ ఎక్స్ రే తీసి తన దగ్గర ఆ పిల్లవాడిని వదిలేస్తే లేచి నడిచేలా చేస్తానని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత దాదాపుగా ఎనిమిది సంవత్సరాల పాటు శివశంకర్ మాస్టర్ మంచానికే పరిమితమయ్యారు.

Telugu Shivashankar-Movie

ఎనిమిదేళ్ల తర్వాత శివశంకర్ మాస్టర్ ఆ గాయం నుంచి కోలుకున్నారు.బాహుబలి సినిమాకు పని చేసే ఆఫర్ వచ్చినా కొడుకు పెళ్లి కారణంగా శివశంకర్ మాస్టర్ ఆ సినిమాకోసం పని చేయలేకపోయారు.పెద్ద కోడలు శివశంకర్ మాస్టర్ పై లేనిపోనివి చెప్పడం వల్ల మాస్టర్ చాలా బాధ పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube