భారత్ లో కూడా బుర్ఖా ను నిషేధించాలి అని కోరుతున్న శివసేన

ఇటీవల శ్రీలంక దేశంలో బుర్ఖాను నిషేదించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ విధానాన్ని భారత్ లో కూడా విధించాలి అంటూ శివసేన డిమాండ్ చేస్తుంది.

 Shiva Sena Wants To Ban Burkha In India Too-TeluguStop.com

శ్రీలంకలో బుర్ఖాపై నిషేధం విధించడాన్ని శివసేన పత్రిక అయిన ‘సామ్నా’ స్వాగతించింది.అయితే ఇదే పద్దతి ని భారత్ లో మోదీ సర్కార్ కూడా అవలంభించాలి అని ఆ పత్రిక ఒక సంపాదకీయంలో వెల్లడించింది.

రావణుడి లంక లో నే ఈ మార్పు జరిగినప్పుడు రాముడు ఉన్న అయోధ్య లో ఇది ఎప్పుడు జరుగుతుంది అని సామ్నా పత్రిక ద్వారా శివసేన ప్రశ్నించింది.అయితే ఈ వాదన పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
మరోపక్క శివసేన ప్రతిపాదన ను అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్రంగా ఖండించారు.

మరోపక్క బీజేపీ సహా పలు పార్టీలు,సంస్థలు శివసేన ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు.బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు ధరించడాన్ని నిషేధించాలన్న శివసేన డిమాండ్ను పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వివాదం ముదురుతుండడం తో శివసేన యూటర్న్ తీసుకుంది.ఆపత్రిక సంపాదకీయం తో పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని శివసేన పార్టీ సీనియర్ నేత వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube