త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమశివుని బోలా శంకరుడు, నీలకంటేశ్వరడు, మల్లికార్జునుడు అని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తుంటారు.అంతేకాకుండా శివుని అభిషేక ప్రియుడు అని కూడా పిలుస్తుంటారు.
అయితే శివునికి మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
రామాయణ ప్రకారం లంకలో రావణ సంహారం జరిగిన తరువాత సీతను తీసుకొని అయోధ్యకు తిరిగి పయనమైన సమయంలో మార్గమధ్యంలో ఒక మహా అరణ్య ప్రాంతంలో ఒక శిఖరం ఉంది.
ఆ అరణ్యప్రాంతంలో శ్రీరాముడు తన సైన్యంతో కలిసి కాసేపు సేద తీరాడు.శ్రీరాముని అనుచరులలో ఒకరైన సుశేణుడు అనే ఒక దైవవైద్యుడు ఆ పర్వత ప్రాంతంలోనే వున్న ఔషధ మౌళిక వృక్షాలను చూసి ఎంతో సంబరపడి పోతాడు.
సుశేణుడు కైలాసానికి చేరుకోవాలనే కోరిక ఈ ప్రాంతంలో ఉంటే నెరవేరుతుందని భావించిన అతను తన మనసులోని మాటను శ్రీరాముడికి తెలియజేస్తాడు.అతని మాటలకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపిన శ్రీరాముడు సుశేణుడు ఆ అరణ్యములోనే వదిలి అయోధ్యకు చేరుకుంటాడు.
అయోధ్యకు చేరుకున్న కొద్ది రోజుల తర్వాత తన యోగక్షేమాలు తెలుసుకుని రావాలని హనుమంతుని ఆజ్ఞాపిస్తాడు.శ్రీరాముని ఆజ్ఞ మేరకు అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిన ఆంజనేయుడు సుశేణుడు కోసం వెతుకుతాడు.
ఎంత వెతికినా అతను కనిపించలేదు.కానీ సుశేణుడు కళేబరాలు హనుమంతునికి కనిపిస్తాయి.

సుశేణుడు శివ తపస్సు లోనే మరణం పొందినట్లు భావించిన హనుమంతుడు సుశేణుని కళేబరాన్ని గొయ్యిలో పాతిపెట్టి, ఆ గొయ్యికి గుర్తుగా అక్కడే ఉన్న మల్లెపూలను, జింక చర్మాన్ని కప్పి అయోధ్యకు వస్తాడు.అయోధ్యలో శ్రీరాముడికి ఈ విషయం తెలియగానే వెంటనే శ్రీరాముడు సీతా లక్ష్మణ లని వెంట తీసుకొని ఆ అరణ్యప్రాంతంలోకి వెళ్తారు.శ్రీరాముడికి సుశేణుని కళేబరాన్ని చూపించడానికి ఆంజనేయుడు జింక చర్మం తియ్యగా అందులో ఒక శివలింగం కనిపించింది.అప్పుడు శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేస్తాడు.
ఆ విధంగా పూజ చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికి ఆ శివలింగం అలా పెరుగుతూ పోతుంది.ఆలయాన్ని నిర్మించాలని భావించిన శ్రీరాముడికి శివలింగం పెరగడంతో ఆలయం నిర్మించడానికి సాధ్యపడలేదు.
ఆ విధంగా పెద్దదైన శివలింగానికి శ్రీరాముని ద్వారా మల్లె పూలతో పూజించి, జింక చర్మం కప్పబడటం వల్ల వెలసిన ఆ శివలింగాన్ని మల్లికాజిన స్వామిగాపిలవడం జరిగింది.కాలక్రమేణా ఆ పేరు మల్లికార్జున స్వామిగా మార్చబడింది.
ఈ విధంగా శివుని మల్లికార్జునుడు అని కూడా పిలుస్తారు.
LATEST NEWS - TELUGU