చేతక్ శీనుగా వస్తున్న కుర్ర హీరో శివ కందుకూరి

పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి తనయుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యువ నటుడు శివ కందుకూరి. చూసి చూడంగానే అంటూ ప్రేమ కథతో ముందుగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసిన ఈ కుర్ర హీరోకి ఆరంభం భాగానే వచ్చింది.

 Shiva Kandukuri New Movie Chetak Sheenu, Tollywood, Telugu Cinema, Gamanam Movi-TeluguStop.com

మరి సూపర్ హిట్ కాకున్న హీరోగా పర్వాలేదనే ఇమేజ్ తెచ్చుకున్నాడు.అయితే తన నెక్స్ట్ సినిమాల విషయంలో రెగ్యులర్ కథలకి దూరంగా డిఫరెంట్ గా ప్రయత్నం చేస్తున్నాడు.

రొటీన్ లవ్ అండ్ కమర్షియల్ కథల జోలికి వెళ్ళకుండా కొత్త కథలని ఎంపిక చేసుకున్నాడు.రెండో సినిమాతోనే పాన్ ఇండియా మూవీ గమనంలో అవకాశం సొంతం చేసుకున్నాడు.

నాలుగు కథల సమాహారంగా నడిచే గమనం సినిమాలో శివ కందుకూరి ఓ ముస్లిం యువకుడు పాత్రలో కనిపిస్తున్నాడు.వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా శివ కందుకూరి కొత్త సినిమాకి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది.

చేతక్ శీను టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ కాన్సెప్ట్ లుక్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

చేతక్ స్కూటీ, వెనుక కొరియర్ బాక్స్ తో డిఫరెంట్ ఎలివేషన్ తో ఉంది.పోస్టర్ బట్టి ఈ సినిమా కామిక్ థ్రిల్లర్ ఎలిమెంట్ తో తెరకేక్కుతుందని అర్ధమవుతుంది.

రొటీన్ కి భిన్నమైన కథతో హీరోగా మూడో సినిమాని శివ కందుకూరి ఎంచుకున్నాడు.ఈ సినిమాతో రాజ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.జనవరి ఫెస్టివల్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube