ఆ వయసులో అంటూ ప్రేమపెళ్లి గురించి సీక్రెట్స్ బయటపెట్టిన శివజ్యోతి!

Shiva Jyothi Reveals Her Love Story And Marriage Life

శివ జ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

 Shiva Jyothi Reveals Her Love Story And Marriage Life-TeluguStop.com

న్యూస్ ప్రెజెంటర్స్ గా తెలంగాణ యాసతో ఎంతో మందిని ఆకట్టుకుంది.బిగ్ బాస్ కి రాకముందు సావిత్రిగా తెలంగాణ మొత్తం బాగా ఫేమస్ అయింది.

ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఈమె లైఫ్ స్టైల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది.ఒకవైపు షోలు, మరొకవైపు ఈవెంట్లు, న్యూస్ ఛానల్ లో ఇలా ప్రస్తుతం కెరిర్ పై దృష్టి సారించి బాగానే సంపాదిస్తోంది.

 Shiva Jyothi Reveals Her Love Story And Marriage Life-ఆ వయసులో అంటూ ప్రేమపెళ్లి గురించి సీక్రెట్స్ బయటపెట్టిన శివజ్యోతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శివ జ్యోతి ప్రేమ పెళ్లి గురించి తెలియని వారు ఉండరేమో.ఈమె గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, దీనికి వారి పెద్దలు ఒప్పుకోకపోవడం, అలాగే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడటం ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలే.

ఇదిలా ఉంటే శివ జ్యోతి మరొక కొత్త షోలో కూడా కనిపించబోతోంది.సూపర్ క్వీన్ అంటూ రాబోతున్న షో లో శివ జ్యోతి మరొకసారి తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పింది.

Telugu Bigg Boss, Ganguli, Love, Shiva Jyothi-Movie

తల్లిదండ్రులు చేసేది కూడా కరెక్టే.వారి ప్రేమ కూడా నిజమే.ఇప్పుడు మేము తల్లిదండ్రులు కావాలి అనుకున్నప్పుడు వారి ప్రేమ ఏంటో ఇప్పుడు అర్థం అవుతోంది.ఆ వయసులో వారి ప్రేమ అర్థం కాలేదు.అన్ని ప్రేమ పెళ్లిళ్లు ఫెయిల్ అవ్వవు.అన్ని అరేంజ్డ్ మ్యారేజ్ లో సక్సెస్ కావు.

లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కాంప్రమైజ్ కావాల్సిందే.సపోర్టు ఉండాల్సిందే అంటూ శివజ్యోతి తన భర్త తనకు ఎంత సపోర్ట్ చేస్తున్నాడు ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన భర్త గురించి తెలిపారు.

#Ganguli #Bigg Boss #Shiva Jyothi #Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube