పెళ్లికి ముందే బ్రేక్అప్ అయ్యామంటున్న శివ బాలాజీ..- Shiva Balaji Seems To Be Breaking Up Before Marriage

Shiva Balaji, breaking up ,before marriage, bigboss 1, horoscope,Madhumita-tollywood-break up-maa asho gadi love story-biggboos-bussiness man-alithosaradaga - Telugu Before Marriage, Bigboss 1, Breaking Up, Horoscope, Madhumita, Shiva Balaji

స్టార్ మా లో మొట్టమొదటిసారిగా ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ గా గెలుపొందిన శివబాలాజీ గురించి అందరికీ తెలిసిందే.ఈయన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటుడు.అంతేకాకుండా శివబాలాజీ ఓ వ్యాపారవేత్త.2009లో మరో నటి మధుమిత ను వివాహం చేసుకున్నాడు.కాగా వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనగా వాళ్ల బ్రేకప్ గురించి కొన్ని విషయాలు తెలిపాడు శివ బాలాజీ.

 Shiva Balaji Seems To Be Breaking Up Before Marriage-TeluguStop.com

2003లో ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా తొలి పరిచయం అయ్యాడు.ఆ తర్వాత ఎలా చెప్పను అనే సినిమాలో నటించగా మొత్తం కలిపి 8 సినిమాల్లో నటించాడు.

గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఈ దంపతులిద్దరూ తమ పిల్లల చదువు విషయంలో స్కూల్ పై వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.కాగా ఇటీవలే ఈటీవీలో ప్రసారమవుతున్న అలీ తో సరదాగా షోలో శివబాలాజీ దంపతులు పాల్గొన్నారు.

 Shiva Balaji Seems To Be Breaking Up Before Marriage-పెళ్లికి ముందే బ్రేక్అప్ అయ్యామంటున్న శివ బాలాజీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇందులో అలీ తమ మొదటి పరిచయం గురించి, తమ వ్యక్తిత్వం గురించి కొన్ని ప్రశ్నలు వేయగా దానికి సమాధానం ఇస్తూ మీ పెళ్లికి ముందు మీరు బ్రేకప్ అయ్యారంట అని అలీ వాళ్లను ప్రశ్నించాడు దీంతో వెంటనే మధుమిత అవును సార్ అది బ్రేకప్ మాత్రం చెప్పలేము.ఎందుకంటే మా ఇద్దరి జాతకాలు కలవలేదని అంతేకాకుండా మా జాతకంలో మా అత్తమ్మ కు సమస్య ఉందని చెప్పగా ఈ విషయాన్ని నేను నమ్మలేదు.

కానీ ఆయన ఇంట్లో జాతకాలను బాగా నమ్ముతారు.పెళ్లికి ముందే మేము ఒకటే అనుకున్నాం.

కానీ ఇంట్లో ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము.దానివల్లే మేము బ్రేక్అప్ అయ్యాము అంటూ తెలిపింది.

ఓ సంవత్సరం తర్వాత నాకు గాని, ఆమెకు గాని వేరే వాళ్లకు పెళ్లి జరిగితే వదిలేయాలి అని అనుకున్నానని శివబాలాజీ చెప్పాడు.దీంతో సంవత్సరం గడిచాక వాళ్లకు పెళ్లిళ్లు కాకపోయే సరికి మళ్ళీ జాతకాలు చూశాక కుదిరాయని తెలిపారు.

#Horoscope #Before Marriage #Breaking Up #Madhumita #Shiva Balaji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు