శివాలెత్తిన శివసేన...షాక్ అయిన షా       2018-06-07   00:48:47  IST  Bhanu C

శివసేన కోపం తగ్గించడం కోసం అమిత్ షా చేయని ప్రయత్నం లేదు..ఎన్డీయే లో భాగస్వామి అయిన శివసేన బీజేపి పై అలకతో బయటకి వచ్చేయాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది..ఒక వేళ శివసేన గనుకా బయటకివచ్చేస్తే మాత్రం బీజేపి హిందువులకి దూరం అవ్వడం ఖాయం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అయితే ఈ భయం తో కూడా బీజేపి శివసేన ని బుజ్జగించడం మొదలుపెట్టింది..మోడీ ఏకపక్ష నిర్ణయాలతో తొలి నుంచి గుర్రుగా ఉన్న శివసేన నేతలను మళ్ళీ తమ దారికి తెచ్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి.

అయితే ఈ క్రమంలోనే బీజేపీ – శివసేన పార్టీల మధ్య నెలకొన్న విభేదాలను మళ్ళీ చక్కదిద్దేందుకు షా ముంబై వెళ్ళారు…ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యారు అయితే గడిచిన నలుగేళ్ళుగా బీజేపీ తీరును తీవ్రంగా ఎండగడుతున్న శివసేనను ఇన్నాళ్లు పట్టించుకోని మోడీ – షా ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి బుజ్జగింపులు మొదలుపెట్టింది. దీన్ని గ్రహించిన శివసేన మరోసారి బీజేపీని నమ్ముకుంటే తీవ్ర నష్టాన్ని చవి చూడవలసి వస్తుందని గ్రహించింది..ఈ క్రమంలోనే షా ని కలిసే విషయంలో ఉద్ధవ్ ఠాక్రే ముప్పుతిప్పలు పెట్టారు.

అంతేకాదు భేటీ కంటే ముందుగానే తమ అజెండా ఏమిటనేది మీడియా ద్వారా శివసేన వెల్లడి చేసింది..

శివసేన ప్రతిసారీ తన రాజకీయ కార్యాచరణను సామ్నా ద్వారానే బయట పెడుతుంది.అ..బిజేపి తో కలిసి ఉండటం మావల్ల కాదు అంటూ అదే పత్రిక ద్వారా తెలుపడం ఇప్పుడు సంచలనం అయ్యింది..2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని తెగేసి చెప్పింది. అమిత్ షా హడావిడిగా ఎన్డీయే మిత్రపక్షాలతో ఎందుకు సమావేశం అవుతున్నారో చెప్పాలంటూ నిలదీసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయంపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

“పాల్ఘడ్” ఉపఎన్నికల్లో శివసేన పార్టీ తన బలం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలోనే… 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంపర్క్ అభియాన్ అంటూ అమిత్ షా ప్రచారం మొదలు పెట్టారు.. అని సామ్నా తన పత్రికలో వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల పర్యటనలో ఉంటే, అమిత్ షా దేశ పర్యటనలో ఉన్నారనీ… ఇలా బీజేపీ అంతర్జాతీయ ప్రచారం మొదలు పెట్టిందని ఎద్దేవా చేసింది..అందితే జుట్టు అందక పొతే కాళ్ళు అనేట్టుగా బీజేపి వ్యవహరిస్తోంది అంటూ దుయ్యబట్టింది..

ఏది ఏమైనా బీజేపి తో కలిసి పని చేసే అవకాశం లేదంటూ సామ్నా పత్రిక ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే ఈ సంఘటనలతో బీజేపి ఒక్క సారిగా ఉలిక్కిపడింది..దాంతో ఇక శివసేనతో మోడీ కానీ లేక బీజేపి సీనియర్ నేతలు కానీ చర్చలు జరపనున్నారు అని ప్రచారం జోరుగా సాగుతోంది..మరి శివసేన ఎలాంటి నిర్ణయానికి అంతిమంగా కట్టుబడి ఉంటుందో వేచి చూడాలి.