సీ ఎం పీఠాన్ని తలా రెండున్నరేళ్లు పంచుకోనున్న ఆ రెండు పార్టీలు  

Shiv Sena-bjp Shares Maharashtra Chief Minister Post-

ఇటీవల ఏపీ క్యాబినెట్ మంత్రుల పదవులు రెండున్నరేళ్లే ఉంటాయని, మరో రెండున్నరేళ్లు వేరేవారికి అవకాశం ఇస్తామని సి ఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ విధానం కొత్తగా ఉందని,అందరినీ తృప్తి పరచడం లో జగన్ అడుగులు వేస్తున్నారని అనుకున్నారు అందరూ.అయితే ఇప్పుడు మహారాష్ట్ర లో ఏకంగా సీ ఎం పదవిని రెండు పార్టీలు పంచుకోనున్నాయి...

Shiv Sena-bjp Shares Maharashtra Chief Minister Post--Shiv Sena-BJP Shares Maharashtra Chief Minister Post-

అవే శివసేన,బీజేపీ.సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయగా మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలని నిర్ణయించాయి.

అయితే ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇరు పార్టీలు తలా రెండున్నరేళ్లు సీ ఎం పదవిని పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

Shiv Sena-bjp Shares Maharashtra Chief Minister Post--Shiv Sena-BJP Shares Maharashtra Chief Minister Post-

లోక్ సభ ఎన్నికలకు ముందే ఇరు పార్టీలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు శివసేన యువనేత వరుణ్ సర్ దేశాయ్ వెల్లడించారు.అయితే ఈ అంశంపై ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ల మధ్య జరిగిన భేటీ లో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అక్టోబర్ మాసంలో జరగనున్నాయి.

అలాంటి ఈ సమయంలో శివసేన యూత్ నేత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.