షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక ప్రకటన.. .

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రతాపం తీవ్రంగా ఉండటంతో షిరిడీ వెళ్లే సాయిబాబా భక్తుల కోసం షిరిడీ సంస్దాన్ వారు కీలక ప్రకటన చేశారు.బాబా దర్శనం వేళల్లో కూడా మార్పులు చేపట్టారు.

 Shirdi Sai Baba Trust Key Announcement In Darshan Timings, Shirdi Saibaba, Sanst-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.ఇకపై ఉదయం 7.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు భక్తుల సందర్శనార్ధం ఆలయం తెరిచి ఉంటుందని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.కాగా ఇదివరకు సాయిబాబా ఆలయం ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేవారు.కానీ ఆసమయాన్ని కుదించారు.అలాగే ఉచిత ఆహారం అందించే శ్రీ సాయి ప్రసాదాలయం ఇకనుండి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు.

అంతే కాకుండా ప్రతీ రోజూ తెల్లవారు జామున 4.30 గంటలకు కాకాడ్ ఆరతీ, అలాగే రాత్రి 10.30 గంటలకు చివరి ఆరతీ యధావిధిగా జరుగుతాయని.కానీ ఈ సమయాల్లో ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించేది లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటనను జారీ చేసింది.

ఇకపోతే ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube