మూతపడనున్న షిర్డీ సాయి ఆలయం.. ఆందోళనలో భక్తులు  

Shirdi Sai Temple Doors To Get Closed-shirdi,shirdi Sai Temple,temple Closed

భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రశాంతతకు పేరొందిన షిర్డీలోని సాయి బాబా ఆలయానికి రోజూ వేలకొద్ది భక్తులు వస్తుంటారు.సాయి దేవుడిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు.ఇక్కడికి వచ్చాక తమ జీవితంలో ప్రశాంతత నిండిందంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు.అయితే ప్రశాంతతకు మారుపేరైన షిర్డీ ఆలయం నిరవధికంగా మూతపడనుంది.

Shirdi Sai Temple Doors To Get Closed-Shirdi Shirdi Closed

అవును.షిర్డీ ఆలయ ట్రస్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

షిర్డీ జన్మస్థలంగా ‘పత్రి’ని అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు షిర్డీ గ్రామస్థులు సమావేశమై వారు షిర్డీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు.గతంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ‘పత్రి’ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది.

‘పత్రి’ని అభివృద్ధి చేస్తే షిర్డీ ఆలయ ప్రాధాన్యం తగ్గుతుందని, షిర్డీ ఆలయాన్ని పర్భణీకి తరలించేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు షిర్డీ ఆలయ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో వారు షిర్డీ ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్లు తెలిపారు.కాగా ఈ విషయంపై సాయిబాబా భక్తులు ఆందోళన చెందుతున్నారు.

మరి ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి.

తాజా వార్తలు

Shirdi Sai Temple Doors To Get Closed-shirdi,shirdi Sai Temple,temple Closed Related....