నా పిల్లలను శిక్షించవద్దు.. ఎమోషనల్ అయిన నటి శిల్పాశెట్టి!

ఎన్నో సంవత్సరాల నుంచి నటిగా, రియాలిటీ షోలకు జడ్జిగా శిల్పాశెట్టి మంచి పేరును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈమె భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో చిక్కుకోవడంతో శిల్పాశెట్టికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 Shilpashetty Released Her Statement In Rajkundra Case-TeluguStop.com

కొంతమంది నెటిజన్లు శిల్పాశెట్టిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.శిల్పాశెట్టి కుటుంబ సభ్యులపై, పిల్లలపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో శిల్పాశెట్టికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి రాగా అందులో కొన్ని వార్తలు ఫేక్ వార్తలు కావడం గమనార్హం.రాజ్ కుంద్రా నుంచి ఇప్పటివరకు తనపై నమోదైన కేసు గురించి ఎలాంటి వివరణ రాలేదు.

 Shilpashetty Released Her Statement In Rajkundra Case-నా పిల్లలను శిక్షించవద్దు.. ఎమోషనల్ అయిన నటి శిల్పాశెట్టి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందించిన శిల్పాశెట్టి తనపై కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారని తన ఫ్యామిలీని కూడా ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Telugu Bollywood, Her Hubsnad, Netizens Trolling, Raj Kundra Case, Shilpashetty, Tollywood-Movie

తన కుటుంబం బాధ పడే విధంగా ట్రోల్స్ చేయడం బాధాకరమైన విషయమని శిల్పాశెట్టి అభిప్రాయపడ్డారు. రాజ్ కుంద్రాపై నమోదైన కేసుల విషయంలో తనకు ఏ స్టాండ్ లేదని తెలిపారు.ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని అందువల్ల ఈ కేసు గురించీ ఎక్కువగా మాట్లాడాలని భావించడం లేదని శిల్పాశెట్టి స్పష్టతనిచ్చారు.

న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తన ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు.

Telugu Bollywood, Her Hubsnad, Netizens Trolling, Raj Kundra Case, Shilpashetty, Tollywood-Movie

29 సంవత్సరాలుగా తాను ఎంతో శ్రమించి పని చేస్తున్నానని తనపై ప్రజల్లో విశ్వాసం ఉందని తాను ఎప్పుడూ ఎవరినీ నిరాశ పరచలేదని శిల్పాశెట్టి చెప్పుకొచ్చారు.తన భర్తపై నమోదైన కేసు విషయంలో మీడియా విచారణ అవసరం లేదని శిల్పాశెట్టి కామెంట్లు చేయడం గమనార్హం.తన పిల్లలను టార్గెట్ చేసి వాళ్లను శిక్షించవద్దని ఆమె కోరారు.

ఈ కేసులో శిల్పాశెట్టి పాత్ర కూడా ఉందా ? లేద ? అనే ప్రశ్నకు మరికొన్ని రోజుల్లో సమాధానం లభించే అవకాశాలు అయితే ఉన్నాయు.

#Hubsnad #Shilpashetty #Netizens #Raj Kundra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు