మాతృత్వాన్ని రెండో సారి ఆస్వాదిస్తున్న శిల్పాశెట్టి  

Shilpa Shetty Became Mother For Second Time - Telugu Bollywood, Second Time, Shilpa Shetty Became Mother, Tollywood

టాలీవుడ్ లో సాహస వీరుడు సాగరకన్య సినిమాలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.దశాబ్దం పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన శిల్పాశెట్టి తరువాత కింగ్స్ లెవన్ పంబాబ్ జట్టుని కొని ఐపీఎల్ లో అడుగుపెట్టి వ్యాపారవేత్తగా మారింది.

Shilpa Shetty Became Mother For Second Time

ఇక ఆమె బిజినెస్ పార్టనర్ రాజ్ కుంద్రా ఆమెకి లైఫ్ పార్టనర్ అయ్యాడు.ఇండియాలో యోగాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎక్కువగా సెలబ్రిటీ యోగాని ప్రచారం చేసే శిల్పాశెట్టి మరో సారి తల్లయింది.

ఈ విషయాన్ని శివరాత్రి సందర్భంగా అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.మా ప్రార్థనలను ఆ దేవుడు విన్నట్లున్నాడు.

వాటి ఫలితమే సమిషా అనుకుంటున్నాం.ఫిబ్రవరి 15న మా చిన్నారి దేవత సమిషా మా ఇంటికి వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.

జూనియర్‌ యస్‌యస్‌కే అని చిన్నారి వేలుని పట్టుకొని దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.అయితే ఆమె తల్లి అయ్యింది గర్భవతి అయ్యి కాదు.

సరోగసి విధానం ద్వారా బిడ్డకి తల్లి అయ్యిందని తెలుస్తుంది.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు గర్భం ద్వారా పిల్లలు కంటే అందం దెబ్బతింటుంది అని సరోగసి విధానం ద్వారా పిల్లలు కంటున్నారు.

ఇప్పుడు శిల్పాశెట్టి కూడా అదే దారిలో వెళ్లి మాతృత్వాన్ని పొందింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shilpa Shetty Became Mother For Second Time Related Telugu News,Photos/Pics,Images..