నెపోటిజం కంటే డెస్టినీ గొప్పది అంటున్న శిల్పా శెట్టి  

Shilpa Shetty Comments on nepotism, Bollywood, Nepotism, B-town, Celebrity Families - Telugu B-town, Bollywood, Celebrity Families, Nepotism, Shilpa Shetty Comments On Nepotism, Shilpa Shetty Said Nepotism Can\\'t Be Bigger Than Your Fate

బాలీవుడ్ లో చాలా కాలంలో నెపోటిజంపై పెద్ద చర్చ నడుస్తుంది.చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ ఉన్న బందిప్రీతి కారణంగా తాము ఎలా అవకాశాలు కోల్పోయింది చెప్పుకుంటూ వచ్చారు.

 Shilpa Shetty Said Nepotism Cant Be Bigger Than Your Destiny

అలాగే ఇండస్ట్రీలో తమకి ఎదురైనా అవమానాలు, పరాభవాలు గురించి కూడా ఏకరువు పెట్టారు.ఇక బంధుప్రీతికి వ్యతిరేకంగా జరుగుతున్న యాంటీ నెపోటిజం ఉద్యమానికి స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నాయకత్వం వహిస్తుంది.

ఆమె అవకాశం దొరికిన ప్రతిసారి బాలీవుడ్ సెలబ్రిటీ కుటుంబాలపై ముప్పేట దాడి చేస్తుంది.సుశాంత్ మరణం తర్వాత ఈ ఇష్యూ మరింత తీవ్రరూపం దాల్చింది.

నెపోటిజం కంటే డెస్టినీ గొప్పది అంటున్న శిల్పా శెట్టి-Movie-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయింది.దర్శకులు, నటులు, నిర్మాతల నుంచి అందరూ రెండు గ్రూప్ లుగా విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

అయితే స్వశక్తితో సక్సెస్ అయ్యి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన కొంత మంది మాత్రం నెపోటిజం అనేది ట్రాష్ అనేస్తున్నారు.ఎదగాలంటే కమిట్మెంట్ కావాలని, ఎక్కడైనా సవాళ్ళు ఎదురవుతాయని అంటున్నారు.

తాజాగా ఇదే విషయమపై ఒకప్పటి స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆమె మాట్లాడుతూ నేను జీవితంలో డెస్టినీని నమ్ముతానని, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, విధిరాత కంటే నెపోటిజం గొప్పదేమీ కాదని పేర్కొంది.

అంతేకాకుండా నేను ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను.కానీ కృషి పట్టుదలతో ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను.విధి కారణంగానే మనమందరం ఇక్కడికి వచ్చాం.కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.

పట్టుదలతో పాటు టాలెంట్ కూడా ఉండాలి.మనం నిర్దేశించుకున్న గమ్యం చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం కోసం పోరాడుతూనే ఉండాలి.అప్పుడు మనల్ని సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు అని శిల్పా శెట్టి చెప్పుకొచ్చారు.

మరి ఆమె మాటలు నెపోటిజంపై పోరాటం చేస్తున్న కంగనా రనౌత్ లాంటి భామలకి ఎంత వరకు రుచిస్తాయో అనేది చూడాలి.

#ShilpaShetty #ShilpaShetty #Nepotism #B-Town

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shilpa Shetty Said Nepotism Cant Be Bigger Than Your Destiny Related Telugu News,Photos/Pics,Images..