మీడియాకు భారీ షాక్ ఇచ్చిన శిల్పా శెట్టి.. పరువు తీస్తున్నారు రూ.25 కోట్లు కట్టండి!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి అందరికీ పరిచయమే.హిందీతో పాటు కన్నడ, తెలుగు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Shilpa Shetty Files Defamation Suit Against Media Houses-TeluguStop.com

ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.ఇదిలా ఉంటే 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోగా.

ప్రస్తుతం తన భర్త పేరు బాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

 Shilpa Shetty Files Defamation Suit Against Media Houses-మీడియాకు భారీ షాక్ ఇచ్చిన శిల్పా శెట్టి.. పరువు తీస్తున్నారు రూ.25 కోట్లు కట్టండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్య శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా చేస్తున్న వ్యాపారం గురించి బయట పడిన సంగతి తెలిసిందే.

నీలి చిత్రకరణ చేస్తూ వాటిని పలు యాప్ లతో బయట పెడుతున్నట్లు తెలియగా ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ గా మారింది.కొందరికి వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తానని తెలిపి వాళ్లతో అలాంటి చిత్రీకరణలు చేస్తున్నట్లు బయటపడింది.

ఇక అప్పటినుండి రాజ్ కుంద్రా గురించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది.తాజాగా మరో బోల్డ్ నటి షెర్లిన్ చోప్రా కూడా ఇతడి గురించి కొన్ని నిజాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే.

Telugu @ani, Against Media, Bollywood, Files, Raj Kundra, Sherlin Chopra, Shilpa Shetty, Shilpa Shetty Defamatiion Case-Movie

అంతేకాకుండా తన భార్య శిల్పాశెట్టి పై పలు రకాలు వ్యాఖ్యలు కూడా చేశారు.ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి తన పరువు పోయిందని పరువు నష్టాన్ని డిమాండ్ చేసింది శిల్పాశెట్టి.ఇప్పటివరకు ఈ విషయం గురించి స్పందించని శిల్పా శెట్టి తాజాగా మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు తెలిపింది.మీడియాపై బాగా విరుచుకుపడింది.తనను కూడా ఈ కేసులో భాగం చేశారని తెలిపింది.

Telugu @ani, Against Media, Bollywood, Files, Raj Kundra, Sherlin Chopra, Shilpa Shetty, Shilpa Shetty Defamatiion Case-Movie

తన భర్త పై వస్తున్న ఆరోపణల గురించి తాను కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో.29 మంది మీడియా వ్యక్తులు, మీడియా సంస్థల పై ఫైర్ అయ్యింది.తప్పుడు రిపోర్టింగ్ చేశారంటూ తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినందుకు రూ.25 కోట్ల నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేసింది.దీంతో ఈ కేసును వార్తా సంస్థ ఏ ఎన్ ఐ రేపు విచారించినట్లు తెలిపింది.

ఇక మీడియాను తప్పుడు రిపోర్టింగ్ చేయకూడదని కోరింది.

#Against Media #Sherlin Chopra #@ANI #ShilpaShetty #Files

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు