నేను బాగానే ఉన్నా మీరు ఇలా చేయండి అంటున్న సమంత ప్రియురాలు

శిల్ప రెడ్డికి కరోనా పాజిటివ్‌ అంటూ తేలిన వెంటనే సమంత అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.వీరిద్దరు ఆప్త మిత్రులు.

 Shilpareddy Give The Suggestions How To Protect The Coronavirus From Us, Shilpa-TeluguStop.com

శిల్పను ఒక సందర్బంలో తన ప్రియురాలు అంటూ సమంత సంభోదించింది.ఇద్దరి మద్య అంతటి సన్నిహిత్యం ఉంది కనుకే సమంత అభిమానులను కరోనా భయంతో రెండు మూడు రోజులు తెగా హడావుడి చేశారు.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్ప రెడ్డి ఎట్టకేలకు సోషల్‌ మీడియా ద్వారా బయటకు వచ్చింది.తమ కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిన విషయాన్ని నిర్థారించింది.

తమ ఇంటికి వచ్చిన బంధువుల ద్వారా తమకు కరోనా వచ్చినట్లుగా భావిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది.అనుమానంతో మొదట తన భర్త వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది.

నాకు ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడ ఆ నేను టెస్టుకు వెళ్లాను.నాకు అక్కడ పాజిటివ్‌ వచ్చింది.మేమిద్దరం కూడా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాం.వైరస్‌ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది.

వీళ్లకు రాదు, వారికి రాకపోవచ్చు అనేది ఏమీ లేదు.కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

శిల్ప రెడ్డి వల్ల సమంతకు వైరస్‌ వచ్చి ఉంటుందని అభిమానులు ఆందోళన చెందారు.కాని సమంతకు ఎలాంటి వైరస్‌ లేదని క్లారిటీ వచ్చింది.

ఇదే సమయంలో శిల్ప రెడ్డి సూచించిన సలహాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

-Movie

ప్రతి రోజు ఎక్సర్‌ సైజ్‌ లు చేయడంతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోదక శక్తి బాగా పెరుగుతుందని, ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువగా ఉన్న వారిని కరోనా వైరస్‌ ఏమీ చేయలేదని పేర్కొన్నారు.అసలు కరోనా లక్షణాలు కూడా అలాంటి వారిలో ఉండవని చెప్పింది.ప్రతి రోజు వ్యాయామం చేసే వారికి రోగ నిరోదక శక్తి ఎక్కువగా ఉంటుంది.

ప్రతి రోజు ఆహారంలో వెల్లులి, తులసి ఆకులు, పుదీనా, మిరియాలు, లవంగాలు ఉండేలా చూసుకోవాలని సూచించింది.పండు మరియు బలవర్ధకమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని శిల్ప రెడ్డి సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube