సోషల్ మీడియాలో తెలుగు యాంకర్ కి వేధింపులు... పట్టించుకోని పోలీసులు...  

Shilpa Chakravarthy Facing Problems In Social Media - Telugu Shilpa Chakravarthy Anchor, Shilpa Chakravarthy Anchor News, Shilpa Chakravarthy Anchor Social Media,, Shilpa Chakravarthy Tollywod Anchor, Tollywod Anchor Shilpa Chakravarthy News

ప్రస్తుత కాలంలో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో సెలబ్రిటీల ను టార్గెట్ చేస్తూ వారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని ఆలోచిస్తున్నారు.ఇందులో భాగంగా ఎవరో ఒక సెలబ్రిటీ ని టార్గెట్ చేస్తూ వారి పై పలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకరంగా పోస్టులు పెట్టడం వంటివి చేస్తున్నారు.

 Shilpa Chakravarthy Facing Problems In Social Media

దీనివల్ల కొందరు సోషల్ మీడియా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా యాంకర్ శిల్పా చక్రవర్తి సోషల్ మీడియాలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

సోషల్ మీడియాలో తెలుగు యాంకర్ కి వేధింపులు… పట్టించుకోని పోలీసులు…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేకాక గత రెండు నెలలుగా ఓ ఆకతాయి తనకు అసభ్యకరమైన మెసేజ్ లు, ఫోటోలు పంపిస్తున్నాడని, ఈ విషయాన్ని ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని, కానీ పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో బాగానే కలకలం రేపుతోంది.

ఈ విషయాన్ని నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు.ఒక సెలబ్రిటీ  తాను సోషల్ మీడియాలో ఇబ్బంది పడుతున్నటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ సైబర్ క్రైమ్ పోలీసులను నిందిస్తున్నారు.

అయితే టాలీవుడ్ యాంకర్లు ఇలా ఆకతాయిల నుంచి వేధింపులు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.గతంలో కూడా టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ఫోటోలను మార్ఫింగ్ చేసి కొందరు అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు.ఈ విషయమై యాంకర్ అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన ఫొటోలను మార్ఫింగ్ చేసిన వాళ్లని పోలీస్ స్టేషన్ కి ఈడుస్తానంటూ  పెద్ద రచ్చ చేసింది.మరి యాంకర్ శిల్పా చక్రవర్తి ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test