బిగ్‌బాస్‌ : పాపం శిల్పా చక్రవర్తి, ఇంతకంటే అవమానం ఉండదు

గత వారం రోజుల నుండి అనుకుంటున్నట్లుగానే, చాలా మంది ఊహించినట్లుగానే, నిన్న మొన్న లీక్‌ అయినట్లుగానే బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నుండి యాంకర్‌ శిల్పా చక్రవర్తి ఎలిమినేట్‌ అయ్యింది.కేవలం రెండు వారాల పాటే ఆమె జర్నీ కొనసాగింది.

 Shilpa Chakravarthy Eliminated For This Week Bigg Boss Telugu-TeluguStop.com

బుల్లి తెరపై ఒకప్పుడు, ఇప్పుడు కూడా షేక్‌ చేస్తూనే ఉన్న శిల్పాకు ప్రేక్షకుల్లో మంచి ఆధరణ ఉంటుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా పోయిన వారం రోజుల్లో ఆమె ప్రవర్తన వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు.

Telugu Himaja, Mahesh Vitta, Srimukhi, Vithika-


 

Telugu Himaja, Mahesh Vitta, Srimukhi, Vithika-


 

Telugu Himaja, Mahesh Vitta, Srimukhi, Vithika-

 

ఆమె ఏ విషయంలో కూడా పెద్దగా స్పందించక పోవడంతో ప్రేక్షకులు ఆమెను చూడలేదు.దాంతో గత వారం ఎలిమినేషన్‌లోకి వచ్చిన సమయంలో ఆమెను ఎవరు పట్టించుకోలేదు.ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపించలేదు.ఈ సీజన్‌లో ఇద్దరు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వెళ్లారు.ఇద్దరు కూడా కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నారు.అది కూడా మొదటి వారం వారు ఎలిమినేషన్‌లోకి రాలేదు, రెండవ వారం ఎలిమినేషన్స్‌కు రావడంతోనే వెంటనే ఎలిమినేట్‌ అయ్యారు.

Telugu Himaja, Mahesh Vitta, Srimukhi, Vithika-


Telugu Himaja, Mahesh Vitta, Srimukhi, Vithika-

 

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌కు కాలం కలిసి రాలేదు అనిపించింది.ఎందుకంటే మొదటి వైల్డ్‌ ఎంట్రీ అత్యుత్సాహం చూపించి, జనాల దృష్టిలో పడి వివాదాస్పదం అయ్యి ఓట్లు దక్కించుకోలేదు.ఇక రెండవ వైల్డ్‌ కార్డ్‌ జనాల దృష్టిని ఆకర్షించడంలో విఫలం అయ్యి ఓట్లు రాబట్టలేక పోయింది.మొత్తానికి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ జర్నీ అతి తక్కువ సమయంకు ఎండ్‌ అయ్యింది.

పాపం శిల్పా చక్రవర్తి ఎంతో ఊహించుకుని ఉంటుంది.కనీసం మూడు నాలుగు వారాలు అయినా ఉండాలని ఆశించింది.

కాని ఆమె క్రేజ్‌కు, ఆమె ఇమేజ్‌కు కేవలం రెండవ వారంలోనే బయటకు రావడం దారుణ అవమానం అని చెప్పుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube