భారత జట్టు స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్( Shikhar Dhawan ) తన విడాకులపై స్పందిస్తూ చేసిన ఆసక్తికర కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇటీవలే జట్టులో స్థానం కోల్పోవడం, అంతేకాకుండా భార్య ఆయేషా ముఖర్జీ( Ayesha Mukherjee ) తో విడాకులు తీసుకోవడం ఒక రకంగా చాలా బాధాకరం.
ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నాడు.
తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ 2021 నుండి భార్యతో విడిపోయి, విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపాడు.
తమ తొమ్మిదేళ్ల సంసార జీవితానికి పుల్ స్టాప్ పెట్టడానికి తానే కారణమని, పెళ్లిపై సరైన అవగాహన లేకపోవడమే విడాకులకు దారి తీసింది అని చెప్పాడు.తనకు కేవలం క్రికెట్ అంటేనే ఇష్టం కాబట్టి, దాదాపు 20 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతూ, క్రికెట్ పైనే తన దృష్టి అంతా ఉందని చెప్పడం జరిగింది.
తనకు 27 ఏళ్ల వయసు వరకు ఒంటరిగా బయట తిరగడం, లేదంటే స్నేహితులతో తిరగడం మాత్రం చేశాడని తెలుపుతూ, జీవితంలో ఎవరితో కూడా రిలేషన్ మాత్రం పెట్టుకోలేదని తెలిపాడు.

తాను ప్రేమలో పడినప్పుడు ఎంతో మధురంగా అనిపించింది.కానీ వివాహం తర్వాత ప్రతి చిన్న ఇబ్బంది పెద్దదిగానే కనిపించేదని, పెళ్లి కూడా ఒకరకంగా క్రికెట్ మ్యాచ్ లాంటిదే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.క్రికెట్ లో రాణించడానికి కొందరికి నాలుగు ఐదు మ్యాచ్ల సమయం పడితే మరికొందరికి ఒకటి రెండు మ్యాచ్ల సమయం పడుతుంది.
పెళ్లికి ముందు కాస్త అనుభవం ఉంటేనే వివాహ బంధం బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ప్రేమించడానికి.పెళ్లి చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉందని, పెళ్లి చేసుకోవడానికి కాస్త అనుభవం కచ్చితంగా ఉండాలని తెలుపుతూ తాను భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపాడు.

ఐపీఎల్ సీజన్ 16 లో పంజాబ్ కింగ్స్ కు శిఖర్ ధావన్ కెప్టెన్ గా బాధ్యతలు వ్యవహరించబోతున్నాడు.ఇటువంటి పరిస్థితులలో ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేసి మళ్లీ భారత జట్టులో స్థానం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు.2023 లో అంతర్జాతీయంగా మ్యాచ్ ( internationally Match ) ఆడే అవకాశం లేకపోయినా, ఐపీఎల్ లో తన సత్తా ఏంటో చూపిస్తే తిరిగి అవకాశాలు రావడానికి ఎక్కువ సమయం పట్టదు.గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత భారత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు.
