జుట్టు రాలకుండా బాగా పెరగాలంటే.... శిఖాకాయి పొడి పాక్స్     2018-07-19   10:42:46  IST  Laxmi P

జుట్టు పెరుగుదలకు శిఖాకాయి పొడిని మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. శిఖాకాయి పొడిలో ప్రోటీన్స్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. శిఖాకాయి పొడిలో కొన్ని నూనెలను కలిపి పాక్స్ తయారుచేసుకొని వాడితే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఆ పాక్స్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

మూడు స్పూన్ల కొబ్బరినూనెలో ఒక స్పూన్ శిఖాకాయి పొడిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా రెండు వారాలకు ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

Shikakai Powder And Oils Hair Packs-

Shikakai Powder And Oils Hair Packs

రెండు స్పూన్ల ఉసిరి నూనెలో ఒక స్పూన్ శిఖాకాయి పొడిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా నెలకు ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
రెండు స్పూన్ల గ్రీన్లో ఒక స్పూన్ శిఖాకాయి పొడిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు బాగా పెరుగుతుంది.
రెండు స్పూన్ల శిఖాకాయి పొడిలో ఒక గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.