త్వరలో పోసానితో జోడీ కట్టనున్న కృతి శెట్టి....

నటి కృతి శెట్టి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది.ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ భామ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

 Shetty Will Soon Be Teaming Up With Posani-TeluguStop.com

ఉప్పెన సినిమాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మంచి నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఉప్పెన హిట్ తో ఇప్పుడు ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

అయితే తాజాగా పోసాని సుధీర్ కుమార్ సినిమాలో ఇంద్రగంటి మోహనక్రిష్ణ డైరెక్షన్ లో నటిస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.ఇప్పటికే ఈ భామకు డైరెక్టర్ తేజ సినిమాలో కూడా హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు.

 Shetty Will Soon Be Teaming Up With Posani-త్వరలో పోసానితో జోడీ కట్టనున్న కృతి శెట్టి….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏది ఏమైనా ఈ భామకు హీరోయిన్ గా మంచి డిమాండ్ ఉందనేది చెప్పవచ్చు.

ఉప్పెన తరువాత సినిమాలు వరుస హిట్ అయితే ఇక కృతి శెట్టిని అందుకోవడం మిగతా హీరోయిన్లకు సాధ్యం కాకపోవచ్చు.17 ఏళ్ల వయసులోనే ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ భామ, ఇక మంచి హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందితే సినీ పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశం ఉంది.ఇప్పటికే ఒక వైష్ణవ్ తేజ్ తో నటించి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన కృతిశెట్టి ఒక్కొక్కరిగా మెగా హీరోలను చుట్టేసే అవకాశం ఉంది.

ఇక అలా అయితే సక్సెస్ ల పరంపర కొనసాగే అవకాశం ఉంది.త్వరలో నానితో జతకట్టనున్న కృతి శెట్టి అందులో ఎటువంటి పాత్రతో అలరిస్తుందో అని కృతి శెట్టి అభిమానులు వేచి చూస్తున్నారు.

#ActressKrithi #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు