నా కోరిక తీర్చాలంటూ దర్శకులను కోరుతున్న కృతి శెట్టి... అదేంటంటే?

సినిమా పరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో తెలియదు.సీనియర్ నటులు చాలా మంది చెప్పే ఒకే ఒక మాట నటుడికి ఎంత టాలెంట్ ఉన్నా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు.

 Shetty Is A Work That Wants Directors To Fulfill My Desire Is That So-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది కూడా.సినిమా పరిశ్రమలో హిట్స్, ఫ్లాప్స్ ఆధారంగా మాత్రమే అవకాశాలు, గౌరవం అనేవి దక్కుతాయి.

అందుకే హిట్ కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు.అయితే ఆ హిట్ మొదటి సినిమాతోటే వస్తే ఇక అదృష్టవంతులనే చెప్పాలి.

 Shetty Is A Work That Wants Directors To Fulfill My Desire Is That So-నా కోరిక తీర్చాలంటూ దర్శకులను కోరుతున్న కృతి శెట్టి… అదేంటంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మాట ఉప్పెన భామ కృతి శెట్టికి కరెక్ట్ గా సరిపోతుంది.టాలీవుడ్ లో ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన ఈ భామ ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

అవకాశాలు వెల్లువ వచ్చిపడుతుందడం, నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి సైతం రెడీగా ఉన్నారంటే ఈ భామ క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.తాజాగా నాకు ఉన్న ఈ కోరికను తీర్చండి అంటూ దర్శకులను కృతిశెట్టి కోరుతోంది.

ఏ నటికైనా సొంతంగా డబ్బింగ్ చెప్పినప్పుడే ఆ పాత్రకు న్యాయం చేశామనే భావనకు వస్తారు.అందుకే కృతి శెట్టి కూడా నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంది.

నా ఈ కోరిక తీర్చండి అంటూ తన మనసులో మాట బయట పెట్టింది కృతి శెట్టి.

#ActressKrithi #KrithiShetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు