బాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజ్ కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చారు.
రాజ్ కుంద్రా తనకు బలవంతంగా ముద్దు పెట్టాడని ఆమె అన్నారు.బిజినెస్ డీల్ కొరకు తన ఇంటికి వచ్చి ఈ పని చేశాడని తనతో మాట్లాడుతూ భార్యతో రిలేషన్ షిప్ సంక్లిష్టంగా మారిందని రాజ్ కుంద్రా వెల్లడించాడని ఆమె అన్నారు.
రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి షెర్లిన్ చోప్రాకు నోటీసులు జారీ కావడంతో ఆమె రాజ్ కుంద్రా గురించి స్పందించారు.
సమన్లు జారీ కావడంతో షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ కీలక విషయాలను చెప్పుకొచ్చారు.రాజ్ కుంద్రా నుంచి బిజినెస్ ప్రపోజల్ కు సంబంధించి 2019 సంవత్సరం మార్చి నెలలో తనకు ఒక కాల్ వచ్చిందని ఆమె తెలిపారు.

ఆ తరువాత తన అనుమతి లేకుండానే రాజ్ కుంద్రా తన ఇంటికి వచ్చారని తాను వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా ముద్దు పెట్టాడని ఆమె అన్నారు.తన ఆనందాలను బిజినెస్ తో ముడిపెట్టాలని తాను అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.అయితే రాజ్ కుంద్రా వివాహమైన వ్యక్తి కావడంతో అతనితో రిలేషన్ షిప్ పెట్టుకోవాలని తాను అనుకోలేదని షెర్లిన్ అన్నారు.

తనతో రాజ్ కుంద్రా ఇంటిదగ్గర ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారని షెర్లిన్ చోప్రా అన్నారు.రాజ్ కుంద్రా మిస్ బిహేవ్ చేయడంతో అతనిని తోసేసి తాను అక్కడినుంచి వెళ్లిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.రాజ్ కుంద్రాపై కొన్ని నెలల క్రితమే షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతుండటం గమనార్హం.