అవును నేను మందుకి బానిసనయ్యా.. కానీ

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వం వహించిన “ఫిలిం బై అరవింద్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాద్ బ్యూటీ షెర్లిన్ చోప్రా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే షెర్లిన్ చోప్రా ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క మోడలింగ్ రంగంలో కూడా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Bollywood Star Heroine Sherlyn Chopra, Alcohol Consumption Habits, Sherlyn Chopr-TeluguStop.com

దీంతో ఆమె పలు సినిమా అవకాశాల రీత్యా ముంబై లో సెటిల్ అయింది.అయితే తాజాగా షెర్లిన్ చోప్రా బాలీవుడ్ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా విషయం పై స్పందించింది.

ఇందులో భాగంగా తాను కూడా ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమలోని పలు చిత్రాలలో పనిచేసిన సమయంలో మద్యం సేవించే దానినని తెలిపింది.కానీ ప్రస్తుతం మద్యం వల్ల కలిగేటువంటి అనర్థాలు గురించి పూర్తిగా అవగాహన కలిగినందువల్ల ధూమపానం, మద్యపానం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది.

అంతేకాక అప్పట్లో తాను అప్పుడప్పుడు పలువురు సినీ సెలెబ్రెటీలు ఇచ్చేటువంటి పార్టీలకి వెళ్లేదానినని ఆ పార్టీలలో కొంత మంది మత్తు మందు పదార్థాలను వినియోగించేవారని తెలిపింది.కానీ తాను మాత్రం ఎప్పుడూ కూడా డ్రగ్స్ ని వినియోగించలేదని స్పష్టం చేసింది.

దీంతో షెర్లిన్ చోప్రా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.

అయితే గతంలో షెర్లిన్ చోప్రా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రూపేష్ పాల్ దర్శకత్వం వహించిన “కామసూత్ర 3డీ” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో గాని సినిమాల పరంగా షెర్లిన్ చోప్రా కొంతమేర జోరు తగ్గించింది.కాగా చివరగా బాలీవుడ్ లో “మాయ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.

ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకూ ఈ అమ్మడుకి సంబంధించిన ఎలాంటి సినిమా అప్డేట్ లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube