హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న శేఖర్ మాస్టర్ కూతురు సాహితి... హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ ఒకవైపు వరస సినిమా అవకాశాలను అందుకుంటూనే, మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇక ఈయన కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల అందరితో కూడా ఈయన అద్భుతమైన స్టెప్పులు వేయించారు.

 Shekhar Masters Daughter Sahiti Who Will Make Her Debut As Heroine Do You Know W-TeluguStop.com

ఇక శేఖర్ మాస్టర్ మాత్రమే కాకుండా ఆయన పిల్లలు విన్ని సాహితీ కూడా అందరికీ ఎంత సుపరిచితమే.ఇప్పటికే విన్ని, సాహితీ ఇద్దరు యూట్యూబ్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయ్యారు.

ఇక విన్ని ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి సందడి చేయగా సాహితి మాత్రం తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని సందడి చేస్తుంది.ఇలా డాన్స్ వీడియోలు ఇంస్టాగ్రామ్ రీల్స్ తో సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాహితి వెండితెర ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఎంతో అందంగా ముద్దుగా ఉన్నటువంటి సాహితీని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో శేఖర్ మాస్టర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Sahitya, Shekhar Master, Tollywood, Vinni-Movie

ఈ క్రమంలోని ఓ కొత్త దర్శకుడు ఇప్పటికే ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారని ఆ కథ శేఖర్ మాస్టర్ కు వినిపించగా ఈ కథ నచ్చడంతో తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.అయితే సాహితి సరసన నటించే హీరో విషయంలో శేఖర్ మాస్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.సాహితి మొదటిసారిగా వెండితెర ఎంట్రీ ఇవ్వడంతో కొంచెం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరోతో సినిమా చేస్తే బాగుంటుందని భావించారట.

ఈ క్రమంలోనే తనకున్న ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలకు కథ వినిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.మరి సాహితి సరసన హీరోగా నటించే ఆ యంగ్ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube