విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమా ను 2017 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ఆ తర్వాత లవ్ స్టోరీ సినిమాను 2021 లో విడుదల చేయడం జరిగింది.
తదుపరి సినిమాను ఇప్పటి వరకు కనీసం మొదలు పెట్టలేదు.ఆ మధ్య ధనుష్ తో సినిమా అంటూ అధికారికంగా ప్రకటించారు.
షూటింగ్ ప్రారంభంకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.అసలు ధనుష్ తో శేఖర్ కమ్ముల సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రకటించిన సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ మరో సినిమా ను అనౌన్స్ చేయడం జరిగింది.శేఖర్ కమ్ముల సినిమా తర్వాత ఆ సినిమా ఉంటుందని అంతా భావించారు.
కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి.మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దాంతో ధనుష్ ఇంతకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల సినిమాకు సంబంధించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో శేఖర్ కమ్ములకు మరియు ధనుష్ కు విభేదాలు వచ్చాయి అని.అందుకే సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ప్రాజెక్ట్ అటకెక్కిందని అంటున్నారు.మరి కొందరు మాత్రం ఈ సినిమా ఉందని నమ్మకంగా చెబుతున్నారు.

దాంతో శేఖర్ కమ్ములను సోషల్ మీడియా ద్వారా అభిమానులు మరియు నెటిజన్స్ ఇంకా ఎన్నాళ్లు ఈ వెయింటింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.శేఖర్ కమ్ముల నుండి సరైన సమాధానం మాత్రం రావడం లేదు.ధనుష్ సినిమా సార్ విడుదల అయిన వెంటనే శేఖర్ కమ్ముల యొక్క సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అనేది మరి కొందరి అభిప్రాయం.
అన్ని విషయాలు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
