అందుకే ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్ వెళ్ళిపోయాడా...?

తెలుగులో పలువురు స్టార్ హీరోల చిత్రాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ “శేఖర్ మాస్టర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా శేఖర్ మాస్టర్ ఒకపక్క సినిమాల్లోడాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తూనే మరోపక్క తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవీ లో ప్రసారమయ్యే “ఢీ” డాన్స్ షోలో కూడా జడ్జి గా వ్యవహరిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Shekar Master Leaving Dhee Show Reason, Shekar Master, Dance Choreographer, Mahi-TeluguStop.com

కానీ గత కొద్దికాలంగా శేఖర్ మాస్టర్ ఢీ షోలో జడ్జి గా వ్యవహరించడం లేదు.దీంతో శేఖర్ మాస్టర్ ని షో నిర్వాహకులు ఢీ షో నుంచి తీసేశారని, అంతేకాక శేఖర్ మాస్టర్ కి మరియు షో నిర్వాహకులకు మధ్య బేధాభిప్రాయాలు, విభేదాలు ఉన్నాయని అందువల్లనే శేఖర్ మాస్టర్ ఢీ షో నుంచి తప్పుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.

దీంతో తాజాగా ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్ ఎందుకు తప్పుకున్నాడనే విషయంపై ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ మహీధర్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించాడు.ఇందులో భాగంగా శేఖర్ మాస్టర్ ని ఢీ షో నుంచి ఎవరూ తప్పించలేదని ప్రస్తుతం శేఖర్ మాస్టర్ తెలుగులో స్టార్ మా ఛానల్ లోప్రసారమయ్యే “కామెడీ స్టార్స్” అనే షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడని అందువల్ల కొంతకాలం పాటు “ఢీ” షో నిర్వాహకులు శేఖర్ మాస్టర్ ని పక్కన పెట్టారని క్లారిటీ ఇచ్చాడు.

అంతేకాకుండా ఎప్పుడైతే కామెడీ స్టార్స్ షోలో జడ్జిగా వ్యవహరించడం మానేస్తారో అప్పుడు మళ్ళీ యధావిధిగా ఢీ షో లో జడ్జి గా జాయిన్ అవుతారని కూడా తెలిపాడు.కాగా ఢీ షోని ప్రముఖ నిర్మాణ సంస్థ మల్లెమాల ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది.

కాగా ఈ సంస్థ నిబంధనల ప్రకారం వీరి షోలు, ఈవెంట్లలో నటిస్తున్న నటీనటులు ఇతర ఛానళ్లలో పని చేయడానికి అవకాశం ఉండదు.అందువల్లనే శేఖర్ మాస్టర్ ఢీ షోకి దూరంగా ఉన్నట్లు సమాచారం.

Telugu Dhee Dance Show, Jabardasth, Mahidhar, Shekar Master, Shekarmaster, Tolly

ఈ విషయం ఇలా ఉండగా డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఒకపక్క పలురకాల షోలు ఈవెంట్లలో జడ్జిగా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాలలో కూడా డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లవ్ స్టోరీ” ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.ఈ చిత్రంలోని “సారంగదరియా” పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube