తెలుగమ్మాయిని భానుమతిగా పరిచయం చేస్తున్న శేఖర్ కమ్ముల  

Shekar Kammula Gives Chance To Telugu Girl-shekar Kammula,telugu Cinema,tollywood

టాలీవుడ్ క్లాసిక్ చిత్రాలతో యూత్ ప్రేక్షకులని తనవైపు తిప్పుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. యూత్ ని టార్గెట్ గా చేసుకొని వారి మధ్య ఉండే చిన్న చిన్న ఎమోషన్స్ ని సిల్వర్ స్క్రీన్ మీద అద్బుతంగా ఆవిష్కరించే శేఖర్ కమ్ముల చివరిగా ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని ఫిదా చేసేసాడు. ఇక ఈ సినిమాతో మలయాళీ ప్రేమమ్ లో మలర్ గా ప్రేక్షకులకి దగ్గరైన సాయి పల్లవిని భానుమతిగా పరిచయం చేసాడు..

తెలుగమ్మాయిని భానుమతిగా పరిచయం చేస్తున్న శేఖర్ కమ్ముల-Shekar Kammula Gives Chance To Telugu Girl

ఫిదా సినిమాతో తర్వాత భానుమతిగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సాయి పల్లవి ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది.

ఇదిలా ఉంటే ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ తన సొంతం ప్రొడక్షన్ హౌస్ అమిగోస్ లోనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని యూత్ ఎలిమెంట్స్ తోనే తనకి అలవాటైన జోనర్ లోనే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల ఓ ప్రొడ్యూసర్ కొడుకుని హీరోగా పరిచయం చేయడంతో పాటు తెలుగమ్మాయిని హీరోయిన్ గా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. డింపుల్ హయాతి అనే తెలుగమ్మాయిని ఆడిషన్ చేసి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ భామ ఇప్పటికే ‘గల్ఫ్’ అనే సినిమాలో నటించిన అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు . భానుమతి సాయి పల్లవిగా మన డింపుల్ కి కూడా శేఖర్ స్టార్ ఇమేజ్ ఇస్తాడేమో వేచి చూడాలి.