చైతూ మూవీ టైటిల్‌ : శేఖర్‌ కమ్ముల టైటిల్స్‌ అంటే ఇలాగే ఉంటాయి మరి

నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ చిత్రంలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

 Shekar Kammula And Nagachaitanaiah New Movie Tittle Name Is Love Story-TeluguStop.com

ఫిదా చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న శేఖర్‌ కమ్ముల ఆ తర్వాత ఒక డాన్స్‌ నేపథ్యంలో సినిమాను మొదలు పెట్టాడు.అంతా కొత్త వారితో ఆ సినిమాను చేశాడు.

కాని ఆ సినిమా మద్యలోనే ఆగిపోయింది.ఆ సినిమాను ఆపేసిన శేఖర్‌ కమ్ముల తర్వాత సినిమాను నాగచైతన్యతో ఇటీవలే మొదలు పెట్టాడు.

Telugu Happydays, Love Story, Nagachaitanaiah, Shekar Kammula, Shekarkammula-

చిన్న బడ్జెట్‌తో సింపుల్‌గా చైతో సినిమాను చేస్తున్నాడు.ఆనంద్‌, గోదావరి, హ్యాపీడేస్‌ వంటి ఫీల్‌ గుడ్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర చాలా మాస్‌గా ఉంటుందని క్లాస్‌ అబ్బాయి మాస్‌ అమ్మాయికి మద్య జరిగే ప్రేమ కథతో ఈ చిత్రంను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఫిదాలో భానుమతి పాత్రను పోలి సాయి పల్లవి పాత్ర ఉంటుందట.

ఇక ఈ చిత్రంకు చాలా విభిన్నమైన టైటిల్‌ కాకుండా చాలా రొటీన్‌ రెగ్యులర్‌ టైటిల్‌ను శేఖర్‌ కమ్ముల ఖరారు చేశాడు.

Telugu Happydays, Love Story, Nagachaitanaiah, Shekar Kammula, Shekarkammula-

ఈ చిత్రానికి ‘లవ్‌ స్టోరీ’ అనే టైటిల్‌ను ఓకే చేసినట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు దినోత్సవం సందర్బంగా విడుదల చేయబోతున్నారు.ఈ ఏడాది మజిలీ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య వచ్చే ఏడాదిని లవ్‌ స్టోరీతో ఆరంభించబోతున్నాడు.

శేఖర్‌ కమ్ముల సినిమాలంటే మినిమం గ్యారెంటీ సక్సెస్‌.వరుణ్‌ తేజ్‌కు ఫిదాతో బ్రేక్‌ ఇచ్చిన కమ్ముల ఈ చిత్రంతో నాగచైతన్యకు సూపర్‌ హిట్‌ ఇస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube