లవ్ స్టోరీ రివ్యూ: చైతు, సాయి పల్లవి నటన కేక.. ఫీల్ రావాలంటే థియేటర్ కి పోవాల్సిందే!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా లవ్ స్టోరీ.ఇందులో అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి నటీనటులుగా నటించారు.

 Shekar Kammula And Naga Chaitanya Love Story Review And Rating Details Here-TeluguStop.com

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలో కే నారాయణ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలుగా చేశారు.ఇక ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 24) విడుదల సందర్భంగా.ఈ సినిమాతో నాగ చైతన్య, సాయి పల్లవి ఎటువంటి సక్సెస్ అందుకున్నారో చూద్దాం.

కథ:

ఇందులో నాగచైతన్య రేవంత్ అనే పాత్రలో నటించాడు.ఈయన ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ కు వస్తాడు.అక్కడ జుంబా కేంద్రాన్ని నిర్వహిస్తాడు.ఇక సాయి పల్లవి మౌనిక పాత్రలో నటించింది.ఈమె ఆర్మూర్ గ్రామానికి చెందిన ధనవంతురాలు.ఈమె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తుంది.

 Shekar Kammula And Naga Chaitanya Love Story Review And Rating Details Here-లవ్ స్టోరీ రివ్యూ: చైతు, సాయి పల్లవి నటన కేక.. ఫీల్ రావాలంటే థియేటర్ కి పోవాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఆమె ఉద్యోగం అందుకోలేకపోతుంది.ఆ తర్వాత రేవంత్, మౌనిక ఎలా కలుస్తారు.

వారిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది.ఆ తర్వాత వారు ఎదుర్కొనే సంఘర్షణలు ఏంటిది మిగిలిన కథలో తెలుస్తుంది.

నటినటుల నటన:

ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు.సాయి పల్లవి చాలా బబ్ల గర్ల్ గా కనిపిస్తుంది.

నాగచైతన్య ఒక సామాన్య వ్యక్తి గా నటించడంతో పాటు తెలంగాణ భాషలో అద్భుతం గా మాట్లాడాడు.ఇద్దరు ఈ సినిమాలో తమ పాత్రలకు ప్రాణం పోసిన నటించారు.

సాయి పల్లవి ఎమోషనల్ సీన్స్ లో మాత్రం అద్భుతంగా నటించింది.నాగచైతన్య మాత్రం తన నటనకు మరింత ప్రాణం పోశాడు.

ఇక వీరిద్దరి మధ్య డైలాగ్స్ కూడా, కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా ఈశ్వరిరావు పర్ఫామెన్స్ కూడా బాగుంది.

టెక్నికల్:

ఇందులో కొన్ని సన్నివేశాలు తప్ప మిగతా భాగం రొటీన్ సన్నివేశాలతో కూడుకొని ఉంది.మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.శేఖర్ కమ్ముల బాగా రూపొందించాడు.చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌ని కూడా ఎంతో అద్భుతంగా చూపించాడు.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

విశ్లేషణ: ఇందులో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉంది.నిజం చెప్పాలి అంటే నాగ చైతన్య నటనను పూర్తిగా డామినేట్ చేసింది.శేఖర్ కమ్ముల పాత్రకు తగ్గట్టు నటులను ఎంచుకున్నాడు.ప్రేక్షకులకు వినోదం పంచే ప్రయత్నం చేశాడు.చాలా వరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించాడు.

ఈ సినిమాను అందమైన ప్రేమ కథతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల.గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో నాగ చైతన్య, సాయిపల్లవి మధ్య ఇగో, లవ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వంటి సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Love Story, Naga Chaitanya, Shekar Kammula, Tollywood-Movie

ప్లస్ పాయింట్స్:

సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్స్ బాగా ఆకట్టుకున్నాయి.తెలంగాణ భాషలో బాగా ఆకట్టుకుంది.ఇందులో నాగచైతన్య డాన్స్ మాత్రం బాగా హైప్ పెరిగింది.ఇందులో నాగచైతన్య జుంబా డాన్సర్ గా నటించడంతో ప్రేక్షకులకు మంచి వినోదం అందింది.

మైనస్ పాయింట్స్:

చాలావరకు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఎక్కడా కనిపించకపోగా.కాస్త కొత్తగా సన్నివేశాలు లేవు, ఫైట్ సీన్ లు వంటివి కూడా అంతగా లేవు.స్లో గా అనిపించింది.

బాటమ్ లైన్:

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య నటన, సాయి పల్లవి డాన్స్ అంత బాగా ఆకట్టుకుంది.మనసుకు తాకే అద్భుతమైన ప్రేమ కథ.మొత్తానికి ఈ సినిమాను థియేటర్ లో చూడవచ్చు.

రేటింగ్: 2.75/5

.

#Love Story #Shekar Kammula #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు