బూర్జ్ ఖలీఫాని తాకిన మెరుపు... షేర్ చేసిన దుబాయ్ యువరాజు  

Sheikh Hamdan Captures Moment Lightning Hit Burj Khalifa-dubai,lightning Hit Burj Khalifa,sheikh Hamdan

ఎడారి ప్రాంతమైన దుబాయ్ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి వైపు అడుగులు వేసింది.ఇక ప్రపంచంలోనే ఎత్తైన బూర్జ్ ఖలీఫా నిర్మాణం దుబాయ్ లో ఉంది.

Sheikh Hamdan Captures Moment Lightning Hit Burj Khalifa-Dubai Lightning Khalifa

ఇక దీనిని చూడటానికి లక్షల సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు.టూరిజం పరంగా దుబాయ్ కి ప్రస్తుతం తిరుగులేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా దుబాయ్ ని తుఫాన్, భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.విమానాశ్రయాల్లోకి వరద నీరు చరడంతో చాలా విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.

అయితే ఈ భారీ వర్షంలోనే ఉరుములు మెరుపుల సమయంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది.

ఆకాశంలోని ఓ మెరుపు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాను తాకిందనిపించేలా ఓ దృశ్యం ఆవిష్కృతమైంది.దుబాయ్ యువరాజు తన కెమెరాలో ఆ దృశ్యాన్ని బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఆ ఫొటో ఒక్కసారిగా వైరల్ గా మారింది.ఆ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ప్రపంచంలోకెల్లా ఎత్తైన నిర్మాణాన్ని సందర్శిండానికి ఆకాశంలోని మెరుపులు సైతం పోటీ పడుతున్నాయని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.బుర్జ్ ఖలీఫాను మెరుపు ముద్దాడిందిని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

.

తాజా వార్తలు