సాధారణంగా మనుషులకు జైలు శిక్ష విధించడం వింటుంటాం.కానీ తాజాగా ఓ గొర్రెకు 3 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించారు.
అదేంటి అని ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ఈ గొర్రె చేసిన నేరం అలాంటిది.ఈ గొర్రె చాలా దూకుడుగా ఉంటుంది.
అంతే కాదు ఇది మనుషులపై కూడా బీకరమైన దాడులు చేస్తోంది.సూడాన్‌లో దేశంలో ఈ గొర్రె ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆదియు చాపింగ్ అనే ఒక 45 ఏళ్ల మహిళపై భయంకరంగా దాడి చేసింది.ఈ ఘటనలో ఆ మహిళ పక్క ఎముకలు విరిగిపోయాయి.
అంతేకాదు ఆమె శరీరంలో అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయి.ఫలితంగా ఆమె కన్నుమూసింది.
ఈ ఘటన సూడాన్‌లోని రుంబెక్ ఈస్ట్‌లోని అకుల్ యోల్లో చోటు చేసుకుంది.ఈ ఘటనలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు యజమానితో పాటు గొర్రెని న్యాయస్థానంలో హాజరుపరిచారు.అయితే ఇలాంటి గొర్రె బయట ఉంటే మనుషుల ప్రాణాలకు ప్రమాదం అని కోర్టు భావించింది.
అందుకే ఈ గొర్రెకు మూడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.అంతేకాదు మృతురాలి కుటుంబానికి నష్ట పరిహారం అందించాల్సిందిగా గొర్రె యజమానిని ఆదేశించింది.
బాధిత కుటుంబానికి గొర్రె యజమాని 5 ఆవులను నష్టపరిహారంగా ఇవ్వాలని ఆర్డర్ వేసింది.

అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత మహిళను చంపేసిన గొర్రెను బాధిత కుటుంబానికి అప్పజెప్పాలని ఆదేశించింది.అయితే ఈ గొర్రె మూడేళ్లపాటు మిలటరీ క్యాంపులో శిక్షను అనుభవిస్తుంది.యజమాని మాత్రం అమాయకుడని అతడికి కేవలం ఫైన్ మాత్రమే విధించింది.
ఈ ఘటన, తీర్పు గురించి తెలుసుకున్న వారంతా అవాక్కవుతున్నారు.ఇలాంటి గొర్రెని పొద్దస్తమానం కట్టేసి ఉంచినట్లయితే మహిళా చనిపోయి ఉండేది కాదని.
యజమానికి కూడా నష్టం వాటిల్లకపోయేదని అంటున్నారు.