ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?  

Sheela kaur, Tollywood actress, heroine, Santhosh reddy, Parugu movie heroine, - Telugu Heroine, Parugu Movie Heroine, Santhosh Reddy, Sheela Kaur, Tollywood Actress

తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన “పరుగు” అనే చిత్రంలో టాలీవుడ్  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  సరసన ఆడిపాడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “హీరోయిన్ షీలా కౌర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను బాగానే అలరించింది.

 Sheela Kaur Tollywood Actress Heroine Santhosh Reddy Parugu

అయితే తెలుగులో 2006 సంవత్సరంలో యంగ్ హీరో నవదీప్ నటించిన “సీతాకోక చిలుక” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.

అయితే తెలుగులో ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, నందమూరి బాలకృష్ణ తదితర స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో ఒకానొక సమయంలో సినిమాలకు స్వస్తి చెప్పి ఇటీవలే ప్రముఖ వ్యాపార వేత్త సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.దీంతో ఒక పక్క తన భర్తకి వ్యాపార పనుల్లో సహాయం చేస్తూ మరో పక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా చివరగా తెలుగులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “పరమ వీరచక్ర” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.ఆ తరువాత ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో నటించలేదు.

ఏదేమైనప్పటికీ పరుగు సినిమాలో ఈ అమ్మడి యాక్టింగ్ అదుర్స్ అని చెప్పొచ్చు.

#Heroine #Sheela Kaur #Santhosh Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sheela Kaur Tollywood Actress Heroine Santhosh Reddy Parugu Related Telugu News,Photos/Pics,Images..