జగన్ పవన్ మధ్యలో ఆమె  

  • ఏపీలో రాజకీయాలు రసవత్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఒక పార్టీని మించి మరో పార్టీ ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. తెలంగాణాలో ఎలా అయితే… అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయో సరిగ్గా అదే ఫార్ములాను ఏపీలో ఉపయోగించేందుకు విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. కాకపోతే ఇవి చర్చల దగ్గరే విఫలం అవుతున్నాయి. దీనికి కారణం పార్టీ అధినేతల మధ్య ఏర్పడిన ఇగోనే కారణంగా తెలుస్తోంది. మొన్నటివరకు వైసీపీ జనసేన కలిసిపోతే చేయబోతున్నాయి ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి అని వార్తలు వచ్చాయి. అయితే అవి చర్చల దగ్గరే విఫలం అయ్యి మళ్ళీ ఒకరిని ఒకరు షరా మామూలుగానే విమర్శించుకున్నారు.

  • She Was Want To Tie Up YS Jagan And Pawan Kalyan In AP-

    She Was Want To Tie Up YS Jagan And Pawan Kalyan In AP

  • అయితే ఇలా పైకి తిట్టుకున్నా… లోలోపల మాత్రం రెండు పార్టీలు కలిసే ముందుకు వెల్దామనే ఆలోచనలో ఉన్నాయి. కాకపోతే ఈ రెండు పార్టీల అధినేతల మధ్య రాజీ కుదిర్చే పని ఎవరూ చేయడం లేదు. అయితే ఆ పని ఒక మహిళ తీసుకుందని వీరిద్దరి మధ్య కొద్దిరోజుల క్రితమే రాజీ చేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ పవన్ కలిసి ఎన్నికలకు వెళ్తే తిరుగే ఉండదని ఒక అంచనాకు వచ్చాయి. అందుకే మళ్లీ ఇద్దరిని కలిసేటట్లు చేయడానికి ‘వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి’ భార్య వై.ఎస్‌.భారతి ప్రయత్నాలు చేస్తోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • ఇప్పటి వరకు చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలన్నీ మర్చిపోవాలని, రాబోయే ఎన్నికల్లో…ఇద్దరూ కలసి పోటీ చేయాలని కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ‘సాక్షి’ దినపత్రిక ఛైర్మన్‌గా ఉన్న ఆమె…’పవన్‌’ను కలిసి రాబోయే ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ‘చంద్రబాబు’ను ఓడించడమే తన ధ్యేయమని చెబుతోన్న ‘పవన్‌’ను తమతో కలసి రావాలని కోరిందనిదానికి ‘పవన్‌’ అంగీకరించారని ఆ వర్గాలు చెబుతున్నాయి.

  • She Was Want To Tie Up YS Jagan And Pawan Kalyan In AP-
  • మీ గురించి జగన్‌ అన్న మాటలను పట్టించుకోవద్దని భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగవని…ఆమె హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె హామీతో పవన్ కూడా ఒకే చెప్పినట్టు… పొత్తు కు తమ పార్టీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పాడట. అప్పట్లో మీ పర్సనల్ లైఫ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నానని, తనను చెల్లిగా భావించిఆ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఆమె పవన్ తో చెప్పినట్టు సమాచారం.