ఎండలకు తట్టుకోలేక ఒక మహిళ వినూత్న నిర్ణయం  

She Uses Cow Dung For Her Car To Reduce Sun Heat-telugu Viral News Updates,unknown Facts About Dong,viral In Social Media

వేసవి తాపం తో ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తూ, ఈ ఎండలకు తట్టుకోలేక కార్లలో సైతం ప్రయాణించడానికి కూడా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఒక మహిళా వినూత్న నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ కు చెందిన ఒక మహిళ ఎండ వేడిని తట్టుకోలేక ఏకంగా తన సెడాన్ కారుకు ఆవు పేడను పులిమేసింది..

ఎండలకు తట్టుకోలేక ఒక మహిళ వినూత్న నిర్ణయం -She Uses Cow Dung For Her Car To Reduce Sun Heat

వాస్తవానికి ఆవు పేడకు వేడిని గ్రహించని గుణం ఉంటుంది అని మన పెద్దలు అంటారు.

అందుకే పూర్వ కాలంలో ఇంటిలో ఆవు పేడ తో అలికేవారు కూడా. ఎందుకంటే ఆవుపేడ తో అలకడం వల్ల ఇంటిలోకి వేడి రాకుండా ఇంటిని చల్లగా ఉంచుతుంది అని. అయితే ఆ విషయాన్నీ అర్ధం చేసుకున్న ఆ మహిళ కారు కు కూడా ఆవు పేడ పూయడం తో అందరూ ఆశర్య పోతున్నారు.

నెటిజన్లు సైతం ఆ మహిళ నిర్ణయానికి మెచ్చుకుంటున్నారు. అయితే ఆవు పేడ పూసిన కారు ఫోటో పేస్ బుక్ లో షేర్ చేయడం తో ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిజంగా ఆమె ను చూసి ప్రతిఒక్కరూ ఈ విధంగా చేయాలని,దానితో మన సంస్కృతీ ఏంటి అనేది కూడా ప్రతిఒక్కరికి అర్ధం అవుతుంది అని గో ప్రేమికుడు రూపేష్ అనే వ్యక్తి సలహా ఇస్తున్నాడు. ఆవు పేడ పూయడం వల్ల కారులోపల చల్ల గా ఉంటుంది అని,ఎసి తో కూడా పని ఉండదు అని రూపేష్ చెబుతున్నాడు.

అయితే దీనిని చూసి ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి.