సిగ‌రెట్ కాల్చే అల‌వాటు వ‌ల్లే ఆమె బ‌తికిపోయింది.. ఎలాగో తెలిస్తే..

She Survived By Smoking A Cigarette

కొంత మంది ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ ఎలాగోలా బతికి బట్టకడతారు.తర్వాత వారు ఎలా బతికారా అని మనం ఆశ్చర్యపోతాం.

 She Survived By Smoking A Cigarette-TeluguStop.com

వారికి భూమ్మీద ఇంకా బతికే యోగ్యం ఉందనుకుంటాం.అటువంటి ఘటనే ఒకటి ఇప్పడు యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగింది.

అదెలాగో తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.

 She Survived By Smoking A Cigarette-సిగ‌రెట్ కాల్చే అల‌వాటు వ‌ల్లే ఆమె బ‌తికిపోయింది.. ఎలాగో తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన దేశంలో అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తినట్టుగానే యూకేలో కూడా అర్వెన్ తుఫాను అల్లకల్లోలం చేస్తోంది.ఇలా అల్లకల్లోలం అవుతున్న సమయంలో ఓ పబ్ మేనేజర్ తన పబ్ ను మూసేద్దామని భావించింది.

అందుకోసం పబ్ లో ఉన్న టేబుళ్లను క్లీన్ చేస్తుంది.కానీ అంతలో ఆమెకు సిగరెట్ తాగాలని అనిపించడంతో పక్కకు వెళ్లి సిగరెట్ అంటించుకుంది.

అంతలోనే ఆమె మొదట ఉన్న టేబుల్ దగ్గర ఓ పెద్ద చెట్టు పడింది.కానీ ఆ మహిళ సిగరెట్ తాగడానికి వేరే చోటుకి రావడంతో బతికి బట్టకట్టగల్గింది.

Telugu Habit-Latest News - Telugu

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ మహిళ ఎలా బతికిందో ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది.అదృష్టం అనేది ఉంటే తప్పకుండా మనం బతుకుతామని మనకు ఉన్న అలవాట్లు అందుకు అడ్డుకావని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నిజంగా మహిళ చాలా లక్కీ కదా.లేకపోతే బ్యాడ్ హ్యాబిట్ కోసం వెళ్లి తన ప్రాణాలను రక్షించుకోవడం అంటే మామూలా.సిగరెట్లు తాగితే పోతారని ఇన్ని రోజులు అనుకున్నాం కానీ ఈ మహిళ సిగరెట్ అలవాటు వలనే బతికి బట్టకట్టింది.

ఇక ఈ విష‌యం నెట్టింట్లో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.ఆమె చాలా అదృష్ట వంతురాలు అని అంతా కామెంట్లు పెడుతున్నారు.

#Habit

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube