వైరల్‌: అడవిలోనే ఆమె చదువు... అడవితల్లి పులకించిపోయింది!

అవును, ఆమెను చూసి ఆ అడవి తల్లి పులకించిపోయింది.హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆ అమ్మాయి ఇపుడు సోషల్ మీడియాలో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

 She Studied In The Forest  The Forest Mother Was Thrilled, Viral, Forest, Educat-TeluguStop.com

దానికి కారణం ఆమె చదువే.ఆమె అందరిలాగా పట్టణాల్లో చదువుకోవడంలేదు.

ఏసీ గదులు, క్లాసురూములు ఆమెకు తెలియని తెలియవు.ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే.

అడవి తల్లి ఒడిలో హాయిగా చదువుకోవడమే ఆమెకు తెలుసు.ఇపుడు అదే విషయం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రాను ఆకర్శించింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అతనికి ఓ ఫోటో బాగా నచ్చడంతో ‘మన్‌డే మోటివేషన్స్‌’ ట్యాగ్‌లైన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

అయితే మొదటగా ఈ ఫోటోను ట్విట్టర్‌ యూజర్‌ ‘అభిషేక్‌ దూబే’ పోస్ట్‌ చేశాడు.ఈ విధంగా ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.“ఈరోజు నేను హిమాచల్‌ద్రేశ్‌లోని సత్నా ప్రాంతానికి వెళ్లాను.అక్కడ చూసిన ఒక దృశ్యం నన్ను ఎంతో ఆనందానికి గురి చేసింది.ఒక అమ్మాయి అడవి తల్లి ఒడిలో శ్రద్ధగా చదువుకుటోంది, నోట్స్‌ రాసుకుంటోంది.పచ్చటి ప్రకృతి ఆమెను దీవిస్తున్నట్లుగా నాకు అనిపించింది.నిజం చెప్పాలంటే… ఈ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు నాకు దొరకడం లేదు!” అంటూ రాసుకొచ్చాడు దూబే.

సదరు పోస్టులో వున్న అమ్మాయిని చూసిన నెటిజన్లు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు.“పట్టణాలలో చదువుకుంటున్న నేటితరం కంటే ప్రకృతి నిశ్శబ్ద వాతావరణంలో చదువుకుంటున్న ఈ బాలిక ఎంత అదృష్టవంతురాలో” అని ఒకడు కామెంట్ చేయగా, “కొన్నిసార్లు నాకు ఈ శబ్దకాలుష్యాన్ని భరించలేక అడవిలోకి పారిపోవాలనిపిస్తుంది.కానీ ఈ అమ్మాయికి అలా పారిపోవాల్సిన అవసరం లేదు!” అని ఒక యూజర్ కామెంట్ చేసాడు.వేరొక యూజర్ కామెంట్ చేస్తూ.“పిల్లలకు నాలుగు గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్యే విద్య నేర్పించాలి.అలాంటప్పుడే వారికి ప్రకృతి విలువ తెలుస్తుంది.

పర్యావరణ స్పృహ బాల్యం నుంచే కలుగుతుంది.గోడలు లేని బడిలో మనసు విశాలం అవుతుంది.” అని కామెంట్ చేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube