పేద‌రికాన్ని ఓడించి 19ఏళ్ల‌కే పైల‌ట్‌గా మారింది.. ఈమె క‌థ ఎంద‌రికో స్ఫూర్తి..

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎన్నో క‌ష్టాలు ఉంటాయి.వాటిని అధిగ‌మిస్తేనే విజ‌య‌తీరాల‌కు చేరుతామ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

 She Overcame Poverty And Became A Pilot At The Age Of 19. Her Story Is An Inspir-TeluguStop.com

కానీ దీన్ని వాస్త‌వంగా కొంద‌రు మాత్ర‌మే చేసి చూపిస్తారు.అందుకే వారు ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తారు.

నిజానికి పేద‌రికం అనేది క‌ల‌ల‌కు అడ్డుకాద‌ని ఇప్ప‌టికే ఎంద‌రో నిరూపించారు.కాలం విసిరే స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ వారి విజ‌యాల‌ను ఆస్వాదిస్తున్నారు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి అమ్మాయి గురించే చెప్పుకోబోతున్నాం మ‌నం.ఆమె కూడా ఎన్నో అడ్డుంకులను దాటుకుని కేవ‌లం పంతోమ్మిదేళ్లకే పైల‌ట్ గా మారింది.

ఇక ఆమె ఏకంగా అతి చిన్న వయసులోనే పైలెట్ గా మారిన అమ్మాయిగా కూడా రికార్డ్ సృష్టించింది.ఆమె పేరే మైత్రీ పటేల్.ఆమె నిజానికి త‌న 8వ ఏట‌నుంచే పైలెట్ కావాలని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు చెప్పింది.కాగా ఈమె గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది.

ఆమె పట్టుదల ముందు ఆమె పేదరికం చిన్న‌బోయింద‌నే చెప్పాలి.ఇంకో విష‌యం ఏంటంటే ఆమె కేవలం 11 నెలల్లోనే త‌న పైలెట్‌ ట్రైనింగ్ ను పూర్తి చేసుకుంద‌ని తెలుస్తోంది.

అయితే ఆమె తండ్రి అయిన కాంతిలాల్ మాత్రం పడవ నడుపుకుంటూ ఆమెను పెంచారంట‌.

Telugu Gujarath, Mithri Patel, Pilot, Poor-Latest News - Telugu

ఇక నాన్న క‌ష్టాలు చూసిన ఆ కూతురు ల‌క్ష్యంగా బాగానే క‌ష్ట‌ప‌డింది.ఇక కాంతిలాల్‌కు కూడా త‌న కూతురును పైల‌ట్ చేయాల‌ని ఎన్నో కళలు కన్నాడంట‌.ఇక ఆమెను ఇందులో భాగంగా ప్రైవేట్ స్కూల్ లో చేర్పించి చ‌దివించాడు.

ఇక కూతురు ల‌క్ష్యంగా కోసం ట్రైనింగ్ ఇప్పించేందుకు ఏకంగా తనకున్న భూమీలో సగభాగాన్ని అమ్ముకున్నాడంట‌.ఇక తండ్రి త్యాగానికి ఆమె చేసిన కృషి ఫ‌లించింది.అతి త‌క్కువ వ‌య‌స్సులోనే పైల‌ట్ గా మారి సంచ‌ల‌నం సృష్టించింది.ఇక ఆమెను రీసెంట్ గానే గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా క‌లుసుకుని అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube