వీడియో : ఫొటోలకు ఫోజ్‌ ఇవ్వడం లేదని కూతురును ఈ తల్లి ఏం చేసిందో చూస్తే కోపం ఆగదు  

She Kicked Her Daughter For Photos-children,daughter,general Telugu Updates,kicked,parents,ఫొటోలకు ఫోజ్‌

మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న డబ్బు అవసరాల నేపథ్యంలో సంబంధ బాంధవ్యాలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి. అత్యంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కర్కషంగా బాధపెడుతున్న సంఘటనలు మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం..

వీడియో : ఫొటోలకు ఫోజ్‌ ఇవ్వడం లేదని కూతురును ఈ తల్లి ఏం చేసిందో చూస్తే కోపం ఆగదు-She Kicked Her Daughter For Photos

కన్న తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. కాని డబ్బు అవసరాల కోసం వారిని బాధ పెట్టడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. జంతువులు వంటివి వాటి పిల్లలను కడుపులో పెట్టుకుని దాచుకుంటాయి.

కాని మనుషులు మాత్రం కొన్ని సార్లు విచక్షణ కోల్పోయి కన్న పిల్లలపై తమ దాష్టికంను ప్రదర్శిస్తారు.

తాజాగా చైనాకు చెందిన ఒక మహిళ తన కూతురును ఫొటోను ఫోజ్‌ ఇవ్వడం లేదనే కారణంతో కాలితో తన్నడం జరిగింది. ఈమె ఈ సారే కాకుండా ఎక్కువగా కూతురు ఫొటోలకు ఫోజు ఇవ్వకుంటే తన్నడం, కొట్టడం చేస్తుందట.

మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆ పాప ఒక మోడల్‌. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కోసం డ్రస్‌లను తయారు చేసే సంస్థలు ఆ పాపతో తమ డ్రస్‌లకు మోడలింగ్‌ చేయించుకుంటూ ఉంటారు. తమ డ్రస్‌ను వేసుకుని ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ ఫొటోలు ఇస్తే అన్ని డబ్బులు ఇస్తూ ఉంటారు.

అందుకే ఆ తల్లి తన కూతురును మోడల్‌ చేసింది. మూడు సంవత్సరాల ఆ బాలికను ఫొటోల పేరుతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రోజులో పది నుండి పదిహేను డ్రస్‌లు వేయడం వల్ల ఆ పాప విసుగు చెందుతుంది..

అలా విసుగు వచ్చినప్పుడు ఆ పాప ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపించదు. అప్పుడు ఆ కనికరం లేని తల్లి కాలితో తన్నడం లేదా కొట్టడం చేస్తుంది. ఆమె గురించి తాజాగా వీడియో బయటకు రావడంతో ఆమెపై కేసు నమోదు అవ్వడంతో పాటు, ఆమె పాపను ఇకపై మోడలింగ్‌ చేయించొద్దు అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.