కాంగ్రెస్ నుంచి ఆమె నేనా.. రేవంత్ మదిలో ఏముంది?

హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉండగా, అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉండబోతున్నట్లు తెలుస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? అనే విషయమై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తున్న తొలి ఎన్నిక హుజురాబాద్ బై ఎలక్షన్ కాగా, ఇందులో రేవంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అనే విషయమై ఆ పార్టీ వర్గాలు చర్చ పెడుతున్నాయి.అయితే, ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో నియోజకవర్గ అభ్యర్థి పోటీ చేసిన యువనేత పాడి కౌశిక్‌రెడ్డి గులాబీ గూటికి చేరి అక్కడ జాక్‌పాట్ కొట్టారు.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకమై పింక్ పార్టీ నుంచి గుర్తింపు పొందాడు.

 She Is From Congress What Is In Rewanths Mind, Revanth, Congress, Konda Surekhan-TeluguStop.com

పాడి కౌశిక్‌తో పాటు పారిశ్రామిక‌వేత్త స్వర్గం రవి ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు? అనేది తేలాల్సి ఉంది.టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి మదిలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి? అని ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Telugu Congress, Etela, Kondasurekhan, Revanth, Swargam Ravi, Ts-Telugu Politica

అయితే, తాజా సమాచారం ప్రకారం వరంగల్ మహిళా నేత కొండా సురేఖ‌ను హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంచాలని రేవంత్ భావిస్తున్నట్లు సమచారం.గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ ఓరుగల్లు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.అయితే, ఇందుకు కొండా సురేఖ ఒప్పుకుందా? అనే విషయం తెలియడం లేదు.ఇకపోతే టీపీసీసీ చీఫ్ రేవంత్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే కానీ హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube