ఆమె ఎంద‌రికో స్ఫూర్తి.. చ‌దువు కోసం ఎలాంటి ప‌ని చేసిందో తెలిస్తే..

She Is An Inspiration To Many If You Know What Kind Of Work She Did For The Study

సమాజంలో ఆడపిల్లలపై చులకన భావం ఎంత ఉంటుందో అందరికీ తెలుసు.అమ్మాయిలకు చదువు, ఉద్యోగం అససరమా? ఎందుకు మీకు ఇవన్నీ.వంటలు నేర్చకుని అత్తింట్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఉచిత సలహాలు ఇచ్చేవారు మన చుట్టు పక్కలే ఎంతో మంది ఉంటారు.అమ్మాయిగా పుడితే తప్పా.అబ్బాయిలతో వారు ఎందులో సమానం కాదు.మగవారు చేసే పనులు అన్నింటినీ అమ్మాయిలు సులువుగా చేసి చూపిస్తున్నారు.

 She Is An Inspiration To Many If You Know What Kind Of Work She Did For The Study-TeluguStop.com

విమానాలు, ఫైటర్ జెట్స్, ఏకంగా రాకెట్ ఎక్కి అంతరిక్ష ప్రయాణాలు కూడా చేస్తున్నా కొందరు మాత్రం ఆడపిల్లలు పుడితే చంపేయడం, చెత్తకుప్పల్లో పడేయటం తరుచూ మనం చూస్తునే ఉంటాం.అలాంటి వారికి యాదాద్రి యువతి తగిన గుణపాఠం చెప్పడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఆమె ఎవరో.అందరికీ ఎలా స్పూర్తిగా నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.

 She Is An Inspiration To Many If You Know What Kind Of Work She Did For The Study-ఆమె ఎంద‌రికో స్ఫూర్తి.. చ‌దువు కోసం ఎలాంటి ప‌ని చేసిందో తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని RBనగర్‌కు చెందిన ‘ఉషారాణి’ ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.అనుకోకుండా తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది.

ఇంట్లో మగ దిక్కు లేకపోవడంతో కుటుంబ ఆలనా పాలనా చూడాల్సిన భారాన్ని తనపై వేసుకుంది.ఉద్యోగం ఎన్నో ప్రయత్నాలు చేయగా బెడిసికొట్టాయి.

దీంతో ఆ చేతులతో స్టీరింగ్ పట్టుకుంది.పట్టణంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూనే చదువు కొనసాగిస్తూ వస్తోంది.రెండేళ్లు ఆటో నడుపుతున్న ఉషారాణి స్థానికంగా చాలా ఫేమస్.

Telugu Bhongiri, Driving Auto, Family, Father Died, Great Girl, Inspiration, Usha Rani, Viral News, Yadadri Usharani, Yadadri Woman-Latest News - Telugu

తండ్రి మరణం తనకు జీవితం అంటే ఎంటో చూపించిందని, ఉపాధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తాను డ్రైవర్‌గా మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఉషారాణి.తనకు తెలిసిన వృత్తి ఆటో నడపడం.అది చేస్తూనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నట్టు తెలిపింది.

ఒక మ‌హిళ డ్రైవింగ్ చేయడం కొత్తేమీ కాదు.తమిళనాడులో మహిళలు ఏకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.

కాలం మారింది.మనం కూడా ఆడవారి పట్ల చులకన భావాన్ని మార్చుకోవాలి.

ఆడవారు తలుచుకుంటే ఏమైనా చేయగలరని గర్వంగా చెబుతోంది ఆటో ఉషారాణి.

#Father #Bhongiri #Yadadri #Usha Rani #Auto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube