నిద్రలో నడకతో ఆమెకు చేదు అనుభవం.. ఏకంగా 15 లక్షల గోల్డ్ చెత్త కుప్పలోకి!

కొంత మంది మనుషులకు కొన్ని వింత అలవాట్లు ఉంటాయి.నిద్రలో నడుస్తూ కొందరు పడిపోయి దెబ్బలు తగిలించుకుంటుంటారు.

 She Had A Bitter Experience With Walking In Her Sleep , Sleeping , Sleep Walk , Gold , Dust Bin, Viral Latest, News Viral, Social Media ,walking In Her Sleep-TeluguStop.com

మరి కొందరు ఏదో దెయ్యం ఆవహించినట్లూ అలా నడుచుకుంటూ ఎటో వెళ్లిపోతారు.ఇలాంటి విషయాలు విన్నప్పుడు కొంచెం నవ్వు వస్తుంది.

కానీ ఒక్కోసారి కొన్ని సంఘటనల్లో ప్రమాదాలు కూడా ఎదురవుతుంటాయి.ఇదే రీతిలో చెన్నైకు చెందిన ఓ మహిళ విషయంలో జరిగింది.

 She Had A Bitter Experience With Walking In Her Sleep , Sleeping , Sleep Walk , Gold , Dust Bin, Viral Latest, News Viral, Social Media ,walking In Her Sleep -నిద్రలో నడకతో ఆమెకు చేదు అనుభవం.. ఏకంగా 15 లక్షల గోల్డ్ చెత్త కుప్పలోకి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా బంగారం అంటే మహిళలు చాలా అపురూపంగా చూసుకుంటుంటారు.ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గొప్ప అనుకుని ఫీల్ అవుతుంటారు.

చాలా జాగ్రత్తగా వాటిని దాచుకుంటుంటారు.అయితే నిద్రలో నడిచే అలవాటు ఉన్న ఓ మహిళ భారీగా బంగారాన్ని పోగొట్టుకుంది.

దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

చెన్నై కుంద్రతూరు పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఓ విచిత్ర సంఘటన జరిగింది.

ఓ వృద్ధ దంపతులు తమ 35 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.తెల్లవారుజామున వారు ఫిర్యాదు చేయగా, ఎటో వెళ్లిపోయిన ఆమె కుమార్తె తిరిగి వచ్చేసింది.

అయితే పోలీసులు తిరిగి వాళ్లింటికి వచ్చారు.ఎందుకంటే 43 సవర్ల బంగారం వాళ్లకు దొరికింది.

వారి కుమార్తె నిద్రలో నడుస్తూ వెళ్లి, ఓ చెత్తకుప్పలో బంగారంతో కూడిన బ్యాగ్ పడేసింది.నిద్రలో కావడంతో ఆమెకు జరిగిన విషయం ఏ మాత్రం గుర్తు లేదు.ఆ పడేసిన బంగారం విలువ రూ.15 లక్షలు. అయితే ఆమె ఏదో పడేయడం సమీపంలోని ఓ సెక్యూరిటీ గార్డు చూశాడు.ఆ తర్వాత అది బంగారం అని తెలిసి తన వద్ద పెట్టుకోలేదు.వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.దీంతో వారు ఆ బంగారాన్ని కోల్పోయిన వారికి చేర్చాడు.

దీంతో పోగొట్టుకున్న బంగారం తిరిగి రావడంతో వారు సంతోషంలో మునిగిపోయారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube