ఈ మధ్యకాలంలో దేశంలో మగవాళ్లలో అరాచకం పెరిగిపోతుంది.ఓ వైపు ఒంటరి మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చేస్తూ మానవ మృగాలుగా తయారైతే, మరో వైపు కట్టుకున్న పెళ్ళాలని కిరాతకంగా చంపేస్తున్నారు.
ఇంకో వైపు ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురువుతూ తుపాకీకి పని చెబుతున్నారు.ఉన్నత కుటుంబాలలో ఎక్కువగా గన్ సంస్కృతి ఉంటుంది.
అలాంటి వారు మద్యం మత్తులో పడి వారికి నచ్చిన పని చేయడం లేదని తుపాకీతో కాల్చి చంపడానికి వెనకాడటం లేదు.తాజాగా ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఆపినందుకు ఓ యువతిని గ్రామ పెద్ద బంధువు తుపాకితో కాల్చేశాడు.
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో జరిగిన ఈ ఘటనకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇప్పుడు ఈ ఘటన సంచలనం అయ్యింది.
తిక్రీ గ్రామంలోని ఓ గ్రామ పెద్ద కుమార్తె వివాహంలో డాన్సర్ డ్యాన్స్ చేస్తుండగా అస్వస్థతకు గురి కావడంతో డాన్స్ ఆపేసింది.దీంతో ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామ పెద్ద బంధువు తుపాకితో కాల్పులు జరిపాడు.
దీంతో అందరూ చూస్తుండగానే ఆ డాన్సర్ స్టేజిపైనే కుప్పకూలిపోయింది.అక్కడ ఉన్నవారు ఆమెని వెంటనే హాస్పిటల్ కి తరలించారు.
అయితే ఇప్పటికి ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసులు దీనిపై సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.