తెలుగమ్మాయికి సమంత ఆఫర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ‘బెంగళూరు డేస్‌’ సినిమా రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తెలుగు మరియు తమిళంలో సమంతకు క్రేజ్‌ ఉండటంతో సమంతను ఎంపిక చేసుకోవడం జరిగింది.

కాని కొన్ని కారణాల వల్ల సమంత రీమేక్‌ నుండి తప్పుకుంది.దాంతో నిర్మాత దిల్‌ రాజు మరియు ప్రసాద్‌ వి పొట్లూరి మరో హీరోయిన్‌ కోసం వెదుకున్నారు.

ఈ నేపథ్యంలో వీరికి ఎక్కువగా వినిపించి పేరు శ్రీదివ్య.తెలుగమ్మాయి అయిన శ్రీదివ్య ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

శ్రీదివ్యకు తెలుగు మరియు తమిళంలో గుర్తింపు ఉంది కనుక ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారు.సమంత వద్దనుకున్న ఆఫర్‌ శ్రీదివ్యకు రావడంతో ఆమె సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తెలుగులో రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాని ఈ అమ్మడికి తమిళంలో మాత్రం భారీ ఆఫర్లే వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా ఒప్పుకోడంతో ఈ తెలుగమ్మాయి క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోనుందని భావిస్తున్నారు.

ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటించనున్నారు.వారి ఎంపిక కూడా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు