ఆమె మ్యాగీ, జొమాటో ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించి, ఓరి దేవుడా సినిమాతో మ‌న‌ల్ని అల‌రించింది.. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే...

మ‌రాఠీ కుటుంబంలో జ‌న్మించిన మిథిలా పాల్కర్ తెలుగులో ఓరి దేవుడా సినిమాలో న‌టించారు.ఈ సినిమాలో వెంక‌టేష్‌, విశ్వ‌క్ సేన్‌, రాహుల్ రామ‌కృష్ణ ముఖ్య తారాగ‌ణం.

 She Appeared In Maggi And Zomato Commercials , Maggi And Zomato Commercials ,-TeluguStop.com

అంచెలంచ‌లుగా సినీ కెరియ‌ర్ లో ఎదుతున్న ఆమె జీవితంలోని కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.మిథిలా పాల్కర్ మ‌హారాష్ట్రలోని వాసాయిలో మరాఠీ కుటుంబంలో జన్మించారు.

దాదర్‌లోని మోడరన్ ఇంగ్లీష్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు.ఆమె 12 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించారు.

ఆమె నాటక పోటీలలో పాల్గొనేవారు.మిథిలా పాల్కర్‌కు చిన్న‌ప్ప‌టి నుంచే నృత్యం, పాడటం పట్ల ఎంతో ఆసక్తి ఉండేది.

మిథిల‌ శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయ‌కురాలు.కథక్ నర్తకి.

మిథిల‌ బాంద్రాలోని ఎంఎంకే కళాశాల నుండి మాస్ మీడియాలో పట్టభద్రురాలైంది.

Telugu Maggizomato, Marathi, Mithila Palkar, Ori Devuda, Venkatesh, Vishwaksen-M

గ్రాడ్యుయేషన్ తర్వాత, లాస్ ఏంజిల్స్‌లోని స్టెల్లా అడ్లెర్ స్టూడియో ఆఫ్ యాక్టింగ్‌లో యాక్టింగ్ క్రాష్ కోర్సు కూడా చేశారు.మిథిల తొలి హిందీ చిత్రం ‘కత్తి బట్టి‘ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, అది ఆమెకు ‘మ్యాగీ’, ‘జొమాటో’ మొదలైన ప్రముఖ బ్రాండ్‌లలో నటించే అవకాశాలను తెచ్చిపెట్టింది.2018లో ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన యంగ్ అచీవర్స్ టాప్ 30 జాబితాలో మిథిల చోటు ద‌క్కించుకుంది.

Telugu Maggizomato, Marathi, Mithila Palkar, Ori Devuda, Venkatesh, Vishwaksen-M

ఉంది.రేణుకా షహానే దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ ఫ్యామిలీ డ్రామా ‘త్రిభంగ’లో కూడా నటించింది తెలుగులో ఆమె ‘ఓరి దేవుడా’ సినిమాలో త‌న ప్ర‌తిభ‌ను చాటింది.జావేద్ జాఫ్రీ మరియు శ్యామ్ అహ్మద్‌లతో కలిసి ‘ఇన్ ద రింగ్’ చిత్రంలో కూడా మిథిలా నటిస్తోంది.అమెరికాకు చెందిన ఫిల్మ్ మేకర్ అల్కా రఘురామ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఫిలింఫేర్ అవార్డ్స్ మరాఠీలో ‘మురంబా’ చిత్రానికి గానూ మిథిలా పాల్కర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును అందుకుంది.ఐరీల్ అవార్డ్స్ 2019, క్రిటిక్స్ ఛాయిస్ టెలివిజన్ అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులలో ‘లిటిల్ థింగ్స్’ కామెడీ సిరీస్‌లో ఆమె ఉత్తమ నటిగా కూడా గుర్తింపు పొందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube