హీరో శర్వానంద్ విడుదల చేసిన P3 పటారుపాలెం ప్రేమ కథ థర్డ్ సాంగ్  

హీరో శర్వానంద్ విడుదల చేసిన P3 పటారుపాలెం ప్రేమ కథ థర్డ్ సాంగ్-patarupalem Love Story,shawanand,third In P3 Patarupalem Love Story

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పటారుపాళెం ప్రేమ కథ” శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో “మళ్ళీ మళ్ళీ వచ్చి పోరాదే – ముద్దిచ్చి పోరాదే” అనే పాటను హీరో శర్వానంద్ విడుదల చేసారు.

హీరో శర్వానంద్ విడుదల చేసిన P3 పటారుపాలెం ప్రేమ కథ థర్డ్ సాంగ్-patarupalem Love Story,shawanand,third In P3 Patarupalem Love Story Telugu Tollywood Movie Cinema Film Latest News-The Third Song In P3 Patarupalem Love Story Released By Hero Sharwanand-Patarupalem Shawanand

ఈ సంధర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ నాకు మంచి మిత్రుడు, ఆయన నాతో వీధి థ స్ట్రీట్ అనే సినిమా తీసిన దర్శకులు దొరైరాజు గారు, ఆయన దర్శకత్వం లో వస్తున్న సినిమా పాటను నేను విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ పాటను నేను విన్నాను పాట చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది.పాట వింటుంటే ఎదో తెలియని ఒక అనుభూతి కలిగింది.

మ్యూజిక్ లవర్స్ అందరూ ఈ పాటను వినండి,మీకూ నచ్చుతుంది, పెద్ద హిట్టు చేయండి, అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.దర్శకుడు దొరైరాజు మాట్లాడుతూ ఈ సాంగ్ నా హీరో శర్వానంద్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను దర్శకత్వం వహించిన వీధి థ స్ట్రీట్ అనే సినిమాతో శర్వా హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ ఫుల్ స్టార్ గా ఎదగడం నాకు చాలా ఆనందంగా ఉంది.

మా సినిమా పాట విడుదల చేసినందుకు శర్వా కు స్పెషల్ థాంక్స్ చెబుతూ, ఈ పాట చాలా బాగుంటుంది, పాట వినే ప్రతి మ్యూజిక్ లవర్ తన గడిచిన లైఫ్ గురించి ఆలోచిస్తారు.ఇప్పటికే విడుదలైన రెండు పాటలను టిక్ టాక్ అండ్ హలో ఆపిలికేషన్ లో కూడా పెద్ద హిట్టు చేసిన యూత్ కి, ప్రేక్షకులకు థాంక్స్.

ఆ రెండు పాటలను మించి మీకు ఈ పాట ఇంకా బాగా నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది, ఈ పాటను కూడా విని మీరు పెద్ద హిట్టు చేయాలని కోరుకుంటున్నాను.

హీరో శ్రీ మానస్ మరియ హీరోయిన్ సమ్మోహణ లు మాట్లాడుతూ మేము కొత్తవాళ్ళమైన దర్శకులు దొరైరాజు గారు కథను నమ్మి మాతో సినిమా తీశారు, కథ అంత బాగుంటుంది.

మా సినిమాలో థర్డ్ సాంగ్ శర్వానంద్ సార్ చేతులు మీదుగా విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది.శర్వా సార్ కి మా ప్రత్యేక ధన్యవాదాలు, ఈ సాంగ్ అందరూ వినండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని తెలిపారు.

అయితే మధ్య కాలంలో ఈ సినిమా సోషల్ మీడియాలో, టిక్ టాక్ లలో సినీ అభిమానులను బాగా అలరిస్తుంది.ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి.వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి.ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జె.

ఎస్ రెడ్డి సమర్పిస్తున్నారు.కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని, పరువుహత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది, అతి త్వరలో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

.

తాజా వార్తలు

హీరో శర్వానంద్ విడుదల చేసిన P3 పటారుపాలెం ప్రేమ కథ థర్డ్ సాంగ్-patarupalem Love Story,shawanand,third In P3 Patarupalem Love Story Related....